Begin typing your search above and press return to search.
అయ్యన్న మాటకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో?
By: Tupaki Desk | 18 April 2017 4:54 AM GMTప్రశ్నిస్తానని చెబుతూనే.. మౌనంగా ఉండటం.. అన్ని అంశాల్లో కాకుండా ఎంపిక చేసిన కొన్ని అంశాల మీదే రియాక్ట్ కావటం.. ట్వీట్లతో అప్పుడప్పుడూ శివాలెత్తుతూ ట్వీటు వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు విప్పేలా తాజాగా ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఒక వ్యాఖ్య చేశారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత ఇప్పటికే విస్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో.. ఒంటరిగా బరిలోకి దిగుతారా? పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్న ఉంది. అయితే.. దీనిపై ఒంటరిగానే బరిలోకి దిగాలన్నది తన అభిమతంగా పవన్ వైఖరి ఉందని చెబుతారు.
అయితే.. పవన్ చెబుతున్న మాటలకు భిన్నమైన పరిస్థితి ఉందన్నది ఏపీ విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగానే.. పవన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలన్నీ బాబు ప్లాన్ లో భాగంగానేనన్న మాటను పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో జనసేన తమ పార్టీతో కలిసి పోటీ చేస్తుందని.. 2014లో ఏ రీతిలో అయితే.. టీడీపీ.. బీజేపీ.. జనసేనలు కలిసి పోటీ చేశాయో.. అదే రీతిలోనే 2019 ఎన్నికలు జరగనున్నట్లుగా చెప్పారు. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ సయోధ్య సాగుతున్నదని.. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ సహకారం తప్పనిసరి అని చెప్పిన అయ్యన్నపాత్రుడు.. 2019 ఎన్నికల్లో బీజేపీ.. జనసేనలతో కలిసి టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తుందన్న వాదనను వినిపించారు. మరి.. దీనిపై పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
మిగిలిన నేతల మాదిరి కాకుండా.. మంత్రి అయ్యన్న పాత్రుడు చివర్లో ఆసక్తికరమైన వ్యాఖ్య ఒకటి చేశారు. 2019 ఎన్నికల పొత్తుపై తానిప్పుడు చెబుతున్న మాటలన్నీ ఉత్త పుణ్యానికి కాదని.. ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. కావాలంటే.. తానిప్పుడు చెప్పిన విషయాల్ని కాగితం మీద రాసి పెట్టుకోవచ్చని చెప్పటం గమనార్హం. మరి.. అయ్యన్నపాత్రుడి మాటల్ని ఎప్పటి మాదిరే పవన్ చూసీచూడనట్లు వదిలేస్తారా? లేక.. రియాక్ట్ అవుతారా? అన్నది ప్రశ్నగా మారింది. అయ్యన్న ఇంత ధీమాగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పవన్ మౌనంగా ఉంటే.. తప్పనిసరిగా అనుమానించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/