Begin typing your search above and press return to search.
అన్నీ తుగ్లక్ నిర్ణయాలే...నవ్వుకుంటున్నారయ్యా ...?
By: Tupaki Desk | 22 Jan 2022 9:06 AM GMTరాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చకా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం విభిన్నంగా ఉంటున్నాయి. దాంతో విపక్షం వాటికి తుగ్లక్ నిర్ణయాలు అని పేరు పెట్టేసింది. విశాఖకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే తుగ్లక్ పాలన అని ఘాటుగా విమర్శలు తరచూ చేస్తూంటారు.
లేటెస్ట్ గా ఆయన మరోమారు జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రతీ జిల్లాలో ఎయిర్ పోర్టులను కడతమాంటూ జగన్ సర్కార్ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఇదంతా అయ్యేపనేనా సారూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
గత ఏడాది ఆర్భాటంగా ఏపీలో 16 మెడికల్ కళాశాలను నిర్మిస్తామని జగన్ సర్కార్ చెప్పిన సంగతిని గుర్తు చేశారు. అన్నింటికీ ఒకేసారి గత ఏడాది మేలో శంకుస్థాపన కూడా చేశారని ఆయన అంటున్నారు. మరి వాటి అతీ గతీ ఇప్పటిదాకా లేనే లేదని కూడా అయ్యన్న పేర్కొన్నారు. మొత్తం పదహారుల్ మెడికల్ కళాశాలలు పూర్తి కావాలీ అంటే ఏకంగా 7, 880 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.
ఒక వైపు చూస్తే ఖజానాలో డబ్బులు లేవని, ఏపీని అప్పుల పాలు చేసి పారేశారు అని అయ్యన్న విమర్శించారు. ఆర్ధిక మంత్రి అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ, ఢిల్లీలోని కేంద్ర పెద్ద చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అలాంటి స్థితిలో ఎయిర్ పోర్టులు జిల్లాకు ఒకటి అని చెప్పడం అంటే ఏమనుకోవాలని ఆయన నిలదీశారు.
ఇక రాష్ట్రానికి జావనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ కి కూడా ఏమీ లేదని, అడుగు ముందుకు పడడంలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆయన అన్నారు. మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రా సుజల స్రవంతి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందని అయ్యన్న అన్నారు. కానీ జగన్ కనీసం వాటి మీద దృష్టి పెట్టలేదని, ఇపుడు తగుదునమ్మా అంటూ కొత్తగా ఎయిర్ పోర్టులు కడతామని అంటున్నారని ఫైర్ అయ్యారు.
మీరు ఏదీ పూర్తి చేయరని, ఏదీ కట్టలేరని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే అంతా చేయాల్సి వస్తుందని కూడా ఆయన అన్నారు. మొత్తానికి జగన్ సర్కార్ ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలతో జనాలను మోసం చేసేందని ఆయన ఘాటుగానే విరుచుకుపడ్డారు. కనీసం ప్రజలు ఎలా ఆలోచిస్తారు అన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు లేకుండా పోయిందని అయ్యన్న ఎద్దేవా చేశారు. జనాలు ఈ నిర్ణయాలను చూసి నవ్వుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. మరి దీనికి వైసీపీ నేతల నుంచి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి.