Begin typing your search above and press return to search.

చింతకాయల మాటల్లో అర్ధమిదేనా ?

By:  Tupaki Desk   |   4 Dec 2021 5:21 AM GMT
చింతకాయల మాటల్లో అర్ధమిదేనా ?
X
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూ లో చింతకాయల మాట్లాడుతూ వైఎస్-జగన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే వైఎస్ ను చూస్తే చింతకాయలకు లేచి దండం పెట్టాలని పిస్తుందట. అదే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా దుర్మార్గుడట. దుర్మార్గుడైన జగన్ ని చూస్తే దండం పెట్టాలని పించదట. తాజాగా చింతకాయల చేసిన కామెంట్లే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయం లో వైఎస్ విషయం లో చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యవహరించిన విధానానికి, జగన్ విషయం లో అవలంభిస్తున్న వైఖరికి నెటిజన్లు తేడాలను వివరిస్తున్నారు. నెటిజన్ల లెక్క ఏమిటంటే వైఎస్ లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. తాను ప్రతిపక్షం లో ఉన్నా లేకపోతే సీఎంగా ఉన్నపుడు కూడా ప్రతిపక్ష పార్టీల నేతలతో మంచి స్నేహ సంబంధాలనే మైన్ టైన్ చేశారు. ఇదే సమయం లో చంద్రబాబు అండ్ కో కూడా వైఎస్ ను ఎప్పుడూ శతృవుగా చూడలేదు.

అప్పట్లో ఇద్దరి మధ్య లో లోపల మంచి అవగాహన ఉండేది కాబట్టి చంద్రబాబు అండ్ కో వైఎస్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయ లేదు. కానీ వైఎస్ మరణించిన తర్వాత జగన్ విషయం లో చంద్రబాబు అండ్ కో ధోరణి మారి పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జగన్ను ప్రత్యర్థిగా కాకుండా శతృవుగా చంద్రబాబు చూసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ పై కాంగ్రెస్ కత్తి కట్టి అక్రమాస్తుల కేసులు పెట్టినపుడు అవసరం లేక పోయినా చంద్రబాబు జగన్ కు వ్యతిరేకంగా కేసుల్లో ఇంప్లీడ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి 23 మంది ఎంఎల్ఏలను లాగేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అడుగడుగునా జగన్ను రాజకీయం గా లేవకుండా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించిన కారణంగానే జగన్ కూడా చంద్రబాబు అండ్ కో ను అలాగే చూస్తున్నట్లు నెటిజన్లు అభి ప్రాయ పడ్డారు. జగన్-చంద్రబాబు ప్రత్యర్ధులు కాకుండా శతృవులై పోయారంటే అందుకు చంద్రబాబే కారణమన్న విషయాన్ని ఉదా హరణలతో సహా వివరిస్తున్నారు.

అఖండ మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన జగన్ను ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు అసలు సీఎం గా గుర్తించటానికి కూడా ఇష్టపడని కారణంగానే వాళ్ళిద్దరి మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయన్నారు. జగన్ కు అయ్యన్న దండం పెట్టినా ఒకటే పెట్టక పోయినా ఒకటే అని నెటిజన్లు ఫైనల్ చేసేశారు.