Begin typing your search above and press return to search.
అయ్యప్ప దీక్షను అవమానించారు: వైసీపీ మాజీ మంత్రిపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 25 Nov 2022 1:30 PM GMTమాజీ మంత్రి, నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై బీజేపీ ఏపీ విభాగం మండిపడింది. అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాలదీక్షను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.
'హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్ప మాలదీ క్షను అవమానపరిచిన మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి. దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసిపి నేత బరితెగించడం సిగ్గుచేటు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తోంది' అంటూ విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు.
కాగా అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీలోని తన నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖుద్దూస్ నగర్‌లో పర్యటించారు.
అయితే ఖుద్దూస్ నగర్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ వారిని ఆకట్టుకోవడానికి ముస్లింల టోపీ ధరించారు. వారితో కలసి నమాజు సైతం చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి ముస్లిం టోపీ ధరించడం, నమాజు చేయడం ఏమిటని నిలదీసింది. ఆయన భేషరతుగా అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరింది.
మరోవైపు అయ్యప్ప భక్తులు కూడా అనిల్ కుమార్ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు చాలా దీక్షగా, పవిత్రంగా ఉండటం అవసరమన్నారు.
మరోవైపు అనిల్‌కుమార్ యాదవ్ అనుచరులు బీజేపీపై మండిపడుతున్నారు. శబరిమలై వెళ్లేటప్పుడు ఎరుమేలిలో ముస్లిం స్వామి అయిన వావర్ స్వామిని ముందుగా దర్శించుకుంటామనే విషయం బీజేపీ నేతలకు తెలియదా అని నిలదీస్తున్నారు. ముందు వావర్ స్వామి గురించి తెలుసుకోవాలని, ఆ తర్వాత పోస్టులు పెట్టాలని విష్ణువర్దన్‌రెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.