Begin typing your search above and press return to search.
రేప్ బాధితురాలికి అజంఖాన్ అవమానం
By: Tupaki Desk | 20 Nov 2015 9:30 AM GMTఅధికారం చేతిలో ఉంటే అహంభావం మామూలే. తాజాగా తనకున్న పవర్ ని ప్రదర్శించాడో మంత్రి. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన దురుసు ప్రవర్తనతో ఆయన వివాదాస్పదంగా మారారు.
తాజాగా.. అత్యాచారానికి గురై.. తనకున్యాయం చేయాలంటూ అభ్యర్థించటానికి వచ్చిన మహిళ పట్ల తన దురుసుతనాన్ని ప్రదర్శించిన అజాంఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన గంగాకి పుకార్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అత్యాచారానికి గురైన మహిళ.. తన లాయర్ ను వెంట పెట్టుకొని మంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ప్రచారం కోసం పాకులాడతావా అంటూ మండిపడిన ఆయన.. అందరి దృష్టిని ఆకర్షించాలన్న తాపత్రయం కోసమే తనను కలవటానికి వచ్చిందన్న అర్థంలో ఆవేశ పడిపోయారు. నీకు జరిగిన అవమానంతో అందరి దృష్టికి ఆకర్షించాలని ప్రయత్నిస్తావా.. గౌరవంగా పోరాడతావా? అంటూ నిలదీసిన ఆయన వైఖరితో అత్యాచార బాధితురాలు మరింత బెదిరిపోయింది. తనకు అన్యాయం జరిగినెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ న్యాయం జరగలేదన్న ఆవేదనను చెప్పుకోవటానికి వచ్చిన ఒక సామాన్యురాలితో మంత్రి మాటలు పలువురికి మంట పుట్టిస్తున్నాయి. చేతిలో ఉన్న అధికారం చేజారే వరకూ నేతల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయేమో.