Begin typing your search above and press return to search.
ఓవైసీని మెచ్చుకున్న శివసేన
By: Tupaki Desk | 8 Dec 2015 10:17 AM GMTమరాఠాల అగ్గిబరాఠ - హిందుత్వం గళం వినిపించడంలో ముందుండే శివసేన... మత రాజకీయాలు చేస్తూ హిందూ దేవతలను విమర్శించే ఏఐఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని అభినందించింది! ఉప్పు నిప్పులా పరస్పరం ఈ ఇరుపక్షాల ప్రతినిధులు విరుచుకుపడటం సహజమే కానీ ఓవైసీని శివసేన కొనియాడటం నిజమేనా అనే సందేహం అక్కర్లేదు. నిజ్జంగా నిజమే.
సమాజ్‌వాదీ పార్టీ నేత - ఉత్తర్ ప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కు విమర్శలు అంటే భలే ఆసక్తి అనే విషయం తెలిసిందే. అయిన దానిపై కాని దానిపై తనదైన శైలిలో విమర్శలు చేసే అజాంఖాన్ తాజాగా పారిస్ లో దుర్మార్గుల బాంబు దాడిని, బాబ్రీ మసీదు సంఘటనపై అదే రీతిలో రియాక్ట్ అయ్యారు. ప్రపంచ దేశాలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లే పారీస్ ఘటన జరిగిందని ఆరోపించారు. బాబ్రీలో లేనిపోని విద్వంసం సృష్టించడం వల్లే ముంబైలో బాంబు దాడి జరిగిందని దుయ్యబట్టాడు.
పారిస్ - బాబ్రిపై అజాంఖాన్ చేసిన ప్రకటనలపై శివసేన అధికార పత్రిక సామ్నా ఘాటుగా స్పందించింది. డర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే అజాంఖాన్ ప్రమాదకారి అని ఆరోపించింది. అజాంఖాన్ వంటి వారుంటే ప్రత్యేకంగా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ కంటే...అజాంఖాన్ ప్రమాదకారి అని మండిపడింది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేదని గుర్తు చేసింది. ఒవైసీ నుంచి అజాంఖాన్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది.
నిప్పు-ఉప్పులా ఉండే శివసేనను అజాంఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏకం చేశాయని రాజకీయ వర్గాలు చెణుకులు విసురుతున్నాయి.