Begin typing your search above and press return to search.
తండ్రికి ఏ మాత్రం తీసిపోడుగా?
By: Tupaki Desk | 22 April 2019 6:22 AM GMTదేశంలో ఎక్కడ మహిళా అభ్యర్థి బరిలో ఉంటే.. సదరు మహిళపై పోటీ చేసే అభ్యర్థికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోరు విప్పటానికి సైతం సంకోచిస్తుంటారు. తొందరపడి ఒక్క మాట నోట జారితే లేనిపోని చిక్కుల్లో పడతామన్న భయంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే.. ఇందుకు ఒక్క మినహాయింపు ఉందని చెప్పాలి. ప్రముఖ సినీ నటి.. రాజకీయ నేత అయిన జయప్రదకు మాత్రం ఎప్పుడూ ఇబ్బందులే.
ఆమెను ఉద్దేశించి ఆమె రాజకీయ ప్రత్యర్థులు చేసే చిల్లర వ్యాఖ్యలు ఆమెను నొప్పించేలా ఉంటాయి. దేశంలో మరెక్కడా లేని రీతిలో జయప్రద విషయంలో ఆమె రాజకీయ ప్రత్యర్థులు తరచూ నోరు పారేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా బీజేపీ అభ్యర్థిని.. సినీ నటి జయప్రదను ఉద్దేశిస్తూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఈ గొడవ ఒక కొలిక్కి రాక ముందే తాజాగా ఆజాంఖాన్ కుమారుడు జయప్రదపై నోరుపారేసుకున్నారు. తండ్రి బాటలో నడుస్తూ ముతక వ్యాఖ్యలు చేశారు. మాకు ఆలీ.. భజరంగబలీలు కావాలే కానీ అనార్కలీ వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన అతగాడు జయప్రద మీద నోరు పారేసుకున్నారు.
జయప్రద మీద చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆజాంఖాన్ మూడు రోజులు ప్రచారానికి ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆజంఖాన్ ఫ్యామిలీకి ఇంకా బుద్ధి వచ్చినట్లుగా కనిపించట్లేదు. తాజాగా జయప్రద మీద చేసిన ముతక వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. జయప్రదను ఉద్దేశించి చేసిన అనార్కలి వ్యాఖ్యలపై ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.