Begin typing your search above and press return to search.

మంత్రిగారి స్వ‌లింగ సంపర్క సంబరం

By:  Tupaki Desk   |   30 Nov 2015 3:59 PM GMT
మంత్రిగారి స్వ‌లింగ సంపర్క సంబరం
X
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, యూపీ మంత్రి అజాం ఖాన్ మ‌రోమారు అదే త‌ర‌హాలో కామెంట్లు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్‌ ఎస్) నాయకులందరూ స్వలింగ సంపర్కుల లాంటి వారని అజాం ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్ ఎస్ ఎస్ నేతలు వివాహాలు చేసుకోరు కనుక వారు హోమో సెక్సువల్స్ వంటి వారని ఆయన అన్నారని నయీ దునియా పత్రిక పేర్కొంది. ఆర్ ఎస్ ఎస్ నాయకులు స్వలింగ సంపర్కులు అంటూ వ్యాఖ్యానించడంపై ఆర్ ఎస్ ఎస్ నేత‌లు తీవ్రంగా స్పందించారు. అజాంఖాన్ మానసిక స్థిరత్వం కోల్పోయాడని ఆర్ ఎఎస్ ఎస్ ప్ర‌తినిధులు విమర్శించారు. మ‌రోవైపు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌ పీ) కూడా అజాంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది

అనధికారికంగా యూపీ కేబినెట్ లో నెంబర్ 2గా కొనసాగుతున్న ఆజంఖాన్ వివాదాల‌ను అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనికి ఆజంఖానే కారణమంటూ షియా పెద్దలు కొద్దికాలం క్రితం సీఎం అఖిలేష్ కు ఫిర్యాదు చేశారు. 2009లో తన సొంత నియోజకవర్గం రాంపూర్ లో బహిరంగ సభలో ఆజంఖాన్ చేసిన ప్రసంగం వీడియోలో పార్టీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్‌ ను హిజ్రాగా కామెంట్ చేశారు. ఖాన్ నియోజకవర్గలంలోని సౌర్ తండా - మిలాక్ - బిలాస్ పూర్ ప్రాంతాలకు కొత్త రాష్ట్రాలకు తరలిపోకుండా ఆపడంలో ములాయం విఫలమయ్యారని, ఆయన హిజ్రాగా వ్యవహరించారని మండిపడ్డారు. తన ప్రసంగంలో ములాయంను హిజ్రా(నపుంసకుడు)గా సంబోధించారు. ఒక్కసారి కాదు... పలుమార్లు ఈ వ్యాఖ్యలు చేయ‌డంతో అపుడు ములాయం మండిప‌డ్డారు.

మ‌రోవైపు ఈ ఏడాది సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జయప్రద పేరు ఖరారు అయినా లాస్ట్ మినిట్ లో అజాం ఖాన్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. జయప్రదను తిరిగి సమాజ్ వాదీలోకి తీసుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ - యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సుముఖంగా ఉన్నా... అజాం ఖాన్ మాత్రం తన మెట్టు దిగలేదు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేదంటూ భీష్మించటంతో జయప్రదకు ఎదురుగాలి తగలింది. 2009లో లోక్ సభ ఎన్నికల్లో జయప్రద అభ్యర్థిత్వాన్ని ఆజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా ఆమెను అప్రదిష్ట పాల్జేసేందుకు పలుమార్లు ఆయన ప్రయత్నించాడు. మొత్తంగా అజాం ఖాన్ సొంత పార్టీలోనే ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ప్ర‌తిప‌క్షాల‌ను సైతం ఇబ్బందుల పాలుచేయ‌డంలో ముందుంటారు.