Begin typing your search above and press return to search.

కామన్ సెన్స్ లేదు.. టీమిండియా మహిళా జట్టుపై అజార్ ఫైర్

By:  Tupaki Desk   |   8 Aug 2022 4:30 PM GMT
కామన్ సెన్స్ లేదు.. టీమిండియా మహిళా జట్టుపై అజార్ ఫైర్
X
భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ విరుచుకుపడ్డారు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఘాటు కామెంట్స్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ లో ఓటమిని చవిచూడడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓడిపోయి స్వర్ణ పతాకాన్ని కోల్పోవడాన్ని అజార్ ఆక్షేపించారు. గెలిచే మ్యాచ్ లో ఓడిపోయారని మండిపడ్డారు. అయితే రజత పతకాన్ని దక్కించుకుంది.

భారత జట్టు బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ నిప్పులు చెరిగారు.టీమిండియా మహిళా జట్టు బ్యాటింగ్ చెత్తగా ఉందంటూ ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ లో 'భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా ఉంది. కామన్ సెన్స్ లేదు. ప్రత్యర్తి జట్టు విజయానికి దారి చూపించారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆస్ట్రేలియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టుకు శుభారంభం లభించింది. కేవలం 16 పరుగుల స్కోరు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. స్కోరు 22 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.అయితే ఆ మూడో వికెట్ కు మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాతనే టీమిండియా గెలవాల్సిన టైంలో పేకమేడలా కుప్పకూలింది.

ఈ మ్యాచ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. కౌర్ ఏకంగా 65 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాత ఎవరూ నిలబడకపోవడంతో టీమిండియా ఓడిపోయింది.

కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి ప్రవేశపెట్టిన మహిళా క్రికెట్ లో భారత జట్టు అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ సారి భారత్ కు గోల్డ్ మెడల్ ఖాయం అని అందరు అనుకున్నారు. అందుకు తగ్గట్టే అమ్మాయిలు కూడా ఆటలో అదరగొట్టారు.

కానీ ఫైనల్స్ లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయి రజత పతకం తో సరిపెట్టుకున్నారు. గోప్పగా పోరాడాల్సిన టీం ఇలా ఓడిపోవడంతో అజారుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు.