Begin typing your search above and press return to search.

ఉగ్రదాడుల్లో హతమైన అజహర్‌ యూసుఫ్‌ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   26 Feb 2019 10:30 AM GMT
ఉగ్రదాడుల్లో హతమైన అజహర్‌ యూసుఫ్‌ ఎవరంటే..?
X
ఈనెల 14న జమ్మూలోని పూల్వామా జిల్లాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అప్పటి నుంచి ఉగ్రవాదులను మట్టుపెట్టుందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా పాక్‌ నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులను చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది హతమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఉగ్రవాదులతో పాటు శిక్షణ పొందుతున్నవారు ఉన్నారు.

భారత్‌ నిర్వహించిన సెర్జికల్‌ స్ట్రైక్స్‌ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అజహర్‌ యూసుప్‌ హతమైనట్లు సమాచారం.. అయితే ఈ అజహర్‌ యూసుఫ్‌ ఎవరనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. జైషే మహ్మద్‌ కు చెందిన ఈ ఉగ్రవాద శిబిరాల్లో అతి కీలకమైంది బాలాకోట్‌ శిబిరం. దీనికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అజార్ మసూద్ బావమరిది అజహర్ యూసుఫ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయననే భారత్‌ లక్ష్యంగా ఎందుకు ఎంచుకొని సర్జికల్ స్ట్రైక్స్ లో హతమార్చింది..

జైషే మహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజహర్‌ బావమరిదే ఈ అజహర్‌ అని సమాచారం. భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌, ఇంటర్‌ పోల్‌ జాబితాలో అజహర్‌ యూసుఫ్ పేరు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విజయ్‌ గోఖలే ప్రకటించారు. 1999 సంవత్సరంలో విమానం హైజాక్‌ లో అజహర్‌ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు మసూద్‌ అజహర్‌ను భారత్‌ విడుదల చేసింది.2002లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాను భారత్‌ విడుదల చేసింది. ఇందులో 20 మంది ఉన్నారు. ఈ జాబితాలో అజహర్‌ యూసుఫ్ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌ లోని కరాచీలో జన్మించిన ఆయన ఉర్దూ, హిందీ మాట్లాడుతారు.