Begin typing your search above and press return to search.
అజహరుద్దీన్‌ను గద్దె దింపబోతున్నారా?
By: Tupaki Desk | 13 Dec 2020 12:55 PM GMTహైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వివాదాలు ఒక పట్టాన ఆగేలా లేవు. కార్య వర్గాలు మారుతున్నాయి కానీ గొడవలకు మాత్రం తెరపడట్లేదు. భారత జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ సంఘం అధ్యక్షుడయ్యాక అయినా పరిస్థితి మారుతుందని, కొత్త కార్యవర్గం అయినా కలహాలు మానేసి.. క్రికెట్ అభివృద్ధి మీద దృష్టిపెడుతుందేమో అనుకుంటే.. ముందున్న వాళ్ల కంటే ఎక్కువగా గొడవలు పడుతుండటం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. అజహర్ పగ్గాలందుకున్నాక కొన్నినెలలకే ఆయనకు, మిగతా ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆయనొక వైపు, మిగతా కార్యవర్గం అంతా ఒక వైపు అన్నట్లు తయారైంది. ఈ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని ఇప్పుడు అజహర్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి మిగతా ఆఫీస్ బేరర్లు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తుండటం గమనార్హం.
హెచ్‌సీఏ జనరల్ బాడీ సమావేశానికి అనుమతి విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్ మధ్య వివాదం రాజుకొంది. ఈ నెల 20వ తేదీన జనరల్ బాడీ మీటింగ్‌కు అనుమతి ఇవ్వాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్ కోరారు. ఐతే ఈ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దని అజహర్ వేరుగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ నుంచి జనరల్ బాడీ సమావేశం విషయమై ఏకాభిప్రాయంతో ఒకే లేఖ ఇవ్వాలని, కార్యవర్గ తీర్మాన లేఖ ఇస్తేనే జనరల్ బాడీ మీటింగ్‌కు అనుమతి ఇస్తామని సీపీ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం లేకుండా జనరల్ బాడీ మీటింగ్‌కు అనుమతించలేమని సీపీ చెప్పారు. ఇదే విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్‌కు సీపీ లేఖలు రాశారు. కానీ ఏకాభిప్రాయం ఎంతమాత్రం సాధ్యమయ్యేలా లేదు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు మిగతా ఆఫీస్ బేరర్లు తీర్మానం చేస్తారన్న భయంతోనే అజహర్ ఈ మీటింగ్ వద్దని అంటున్నట్లు హెచ్‌సీఏ వర్గాల సమాచారం.