Begin typing your search above and press return to search.
ఓవైసీలకు చెక్ చెప్పేంత సీన్ అజ్జూకి ఉందా?
By: Tupaki Desk | 3 Jan 2016 5:53 AM GMTఅధికారంలో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించటం.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటం కనీస ధర్మం. కానీ.. అలాంటి ప్రాధమిక సూత్రాల్ని కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా విస్మరిస్తోంది. పవర్ అన్నది శాశ్వితం కాదని.. అది లేనప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాల మీద కొద్దిపాటి ముందస్తు ఆలోచన ఉంటే.. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే సమస్యల్లో చాలావరకూ ఉండేవే కాదు.
కానీ.. అలాంటి ముందస్తు ఏర్పాట్లు ఏమీ చేసుకోకుండా ఉన్నందుకు కాంగ్రెస్ ఇప్పుడు భారీ మూల్యాన్నే చెల్లిస్తోంది. కొందరి నాయకుల్నినమ్ముకున్న కాంగ్రెస్ కు.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే వారు ఎవరూ లేని దుస్థితి. కొందరు నేతల్ని పెంచి పెద్ద చేసేందుకు అవకాశం ఉన్నా.. పట్టించుకోకపోవటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.
హైదరాబాదీ స్టార్ క్రికెటర్ అజహరుద్దీన్ వ్యవహారాన్నే తీసుకుందాం. హైదరాబాద్ కు చెందిన ఈ స్టార్ ఆటగాడు.. చివర్లో ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకొని.. చివర్లో కాస్త బయటపడిన సంగతి తెలిసిందే. ఆయన్ను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఎప్పుడూ గ్రేటర్ లోని పాతబస్తీకి ఆయన్ను ఒక ఆయుధంగా మార్చుకోవాలన్న ఆలోచన చేయలేదు.
తెలంగాణ వ్యాప్తంగా తమకు బలం ఉన్నప్పుడు.. ఒక్కపాత బస్తీని లెక్కలోకి తీసుకుంటే ఎంత? అన్న ధోరణిలోనే ఉంది తప్ప.. తన సొంత బలాన్ని పెంచుకోవాలన్న ఆలోచన చేయలేదు. పదేళ్లు పవర్ లో ఉన్న కాంగ్రెస్.. పాతబస్తీ మీద ఏ మాత్రం ఫోకస్ చేసినా.. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ఓవైసీల తీరును అంచనా వేయటంలో ఫెయిల్ అయిన కాంగ్రెస్.. ఇప్పుడు దిద్దుబాటు మొదలెట్టింది.
తాజాగా జరిగే గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ ను సీన్లోకి తీసుకురావాలని భావిస్తోంది. యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న అజ్జూను.. గ్రేటర్ ఎన్నికలకు తమ తురుపుముక్కలా వాడుకోవాలని భావిస్తోంది. అయితే.. ఓవైసీ బ్రదర్స్ లాంటి క్రూసేడర్ల ముందు.. అజ్జూలాంటి వారి నిలబడతారా? అన్నది ఒక ప్రశ్న. ఎప్పడూ హైదరాబాద్ సిటీని పట్టించుకోని అజ్జూను.. గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా ప్రయత్నిస్తే.. లాభం కలుగుతుందా? అన్నది పెద్ద ప్రశ్న. పాతబస్తీలో తిరుగులేని అధిక్యతను పోషించే ఓవైసీ బ్రదర్స్ కు ధీటుగా అజ్జూ వ్యవహరించగలరా? అన్నది సందేహే. తన బలహీనత తెలిసిన అజ్జూ.. అధినాయకత్వం ఆలోచనకు ఓకే చెబుతారా..?