Begin typing your search above and press return to search.
కారెక్కనున్న అజారుద్దీన్!
By: Tupaki Desk | 30 Nov 2018 7:12 AM GMTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ - సీనియర్ నేత అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? త‌్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఓ టికెట్ ఫై టీఆర్ ఎస్ నుంచి హామీ లభించగానే కారెక్కేయాలని ఆయన భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాంగ్రెస్ లో స్టార్ డమ్ ఉన్న నేతల్లో అజారుద్దీన్ ఒకరు. ప్రస్తుతం తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదాను కూడా కట్టబెట్టింది అధిష్ఠానం. ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ కాంగ్రెస్ లో తన భవిష్యత్తుపై అజారుద్దీన్ ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత త్వరగా పార్టీకి గుడ్ బై చెబితే అంత మంచిదని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని అజారుద్దీన్ కోరుకుంటున్నారు. ఇటీవలే తన మనసులో కోరికను బయటపెట్టాడు కూడా. అయితే - ఆ స్థానానికి కాంగ్రెస్ లో గట్టి పోటీ ఉంది. సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే రెండు పర్యాయాలు అక్కణ్నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు కూడా ఆయనకే ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరే అవకాశాలను అజారుద్దీన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత టీఆర్ ఎస్ అధినాయకత్వంతో చర్చలు జరిపి.. టికెట్ పై హమీ లభిస్తే వెంటనే ఆ పార్టీలో చేరాలన్నది అజ్జూ వ్యూహమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే - అజారుద్దీన్ లో అసంతృప్తిని కాంగ్రెస్ గ్రహించిందని.. ఆయన్ను బుజ్జగించేందుకు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టిందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ బుజ్జగింపులకు అజారుద్దీన్ కరిగిపోతారా? లేక పార్టీని వీడటం ఖాయమేనా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదు!