Begin typing your search above and press return to search.
అజ్జూభాయ్ కు సొంతూరు గుర్తుకొచ్చింది
By: Tupaki Desk | 16 July 2018 4:20 AM GMTతెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొందరు ప్రముఖులు ఉంటారు. వారి తీరు చాలా చిత్రంగా ఉంటుంది. సొంత ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు పెద్దగా ఇష్టపడరు. లోప్రొఫైల్ ప్రదర్శించే సదరు ప్రముఖులు.. తమకే మాత్రం సంబంధం లేని రాష్ట్రాల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో దిగుతుంటారు. అలాంటి వారిలో ఒకరు ఒకప్పటి టీమిండియా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్.
పక్కా హైదరాబాదీ అయిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు రాజకీయాల వైపు దృష్టి సారించేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించలేదు. 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందిన ఆయన.. 2014లో రాజస్థాన్ లోని టోంకో-సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి ఏమైందో కానీ.. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తన సొంతూరు నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను సొంత ప్రాంతం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నియోజకవర్గానికి చెందిన పలువురు తనతో చెబుతున్నారని.. అందుకే సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తాను సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలతోనూ.. ప్రజలతోనే మాట్లాడానని.. వారంతా తనను బరిలోకి దిగాలని చెప్పినట్లుగా వెల్లడించారు. అజ్జూభాయ్ ఊపు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ సీటు నుంచి గెలుపు పక్కా అన్నట్లే ఉంది. మరి.. దీనిపై లోకల్ లీడర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.