Begin typing your search above and press return to search.

బీటెకీలకు ఇదో సరికొత్త ఈజీ ఉపాధి

By:  Tupaki Desk   |   1 Sep 2019 8:19 AM GMT
బీటెకీలకు ఇదో సరికొత్త ఈజీ ఉపాధి
X
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ బీటెక్ చదువుతున్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు వరంగా మారింది. కేవలం అరగంట పనిచేస్తే చాలు వేలల్లో వారికి ఆదాయం సమకూరుతోంది.

ఇంతకుముందు ఇసుకు రీచుల్లో ఇబ్బడిముబ్బడిగా ఇసుకును దోచుకొని అందరూ కోట్లు కొల్లగొట్టేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ఆన్ లైన్ లో ఇసుక అమ్మేందుకు బుకింగ్ చేసుకునే విధానాన్ని 2017 జూలైలో ప్రవేశపెట్టింది. ఇసుక కావాల్సిన లారీల యజమానులు
www.sand.telangana.gov.in
వెబ్ సైట్లో వెళ్లి లారీ నంబర్ - ఆధార్ - ఫోన్ నంబర్ తో బుక్ చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్ అయ్యి ఎంత కావాలో ఎక్కడ నుంచి కావాలో ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత బుక్ చేస్తే ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే బుక్ అయినట్టు నిర్ధారణ షీట్ వస్తుంది.

అయితే ఈ తతంగం అంతా లారీ యజమానులు - ఇసుకను రవాణా చేసే వారికి చాలా కష్టమైన పని. దీంతో ఈ ఆన్ లైన్ విధానం తెలిసిన ల్యాప్ ట్యాప్ లు కలిగిన బీటెక్ విద్యార్థులను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. భారీగా డబ్బు కూడా ఇస్తుండడంతో ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఇదే పనిలో పడ్డారు. రోజులో అరగంటపాటు ఇలా ఇసుక బుక్ చేస్తే లారీ యజమానులు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు డబ్బులు ఇస్తున్నారట.. దీంతో కాలేజీ చదువుకుంటూనే ఇప్పుడు పనిని క్లాసులు ఎగ్గొట్టీ మరీ స్టూడెంట్స్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగాలు ఎగ్గొట్టి మరీ ఇదే పనిలో పడ్డారట..

ప్రతీ మధ్యాహ్నం 12 గంటలకు ఇసుక బుకింగ్ లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. బీటెక్ స్టూడెంట్స్ అంతా లారీ యజమానులతో ఒప్పందం చేసుకొని ఇప్పుడు ఇదే పనిచేస్తున్నారు. కేవలం అరగంట పనికి వేలల్లో వస్తున్న ఇసుక బుకింగ్ ఆదాయం బీటెకీలకు కాసుల పంట పండిస్తోంది. అయితే ఒకేసారి ఇంతమంది బుక్ చేయడంతో ఇసుక కృత్రిమ కొరత కూడా అవుతోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.