Begin typing your search above and press return to search.
తెలుగువారికి గౌరవం.. ట్రంప్ ముందు బాహుబలి పాట
By: Tupaki Desk | 24 Feb 2020 6:30 AM GMTప్రపంచంలోనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. ఇప్పటికే దేశమంతా ట్రంప్ మేనియా వచ్చేసింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించే ట్రంప్ కోసం మోడీ సర్కారు అంగరంగ వైభవం గా ఏర్పాట్లు చేసింది.
ట్రంప్ భారత గడ్డపై కాలు పెట్టిన నాటి నుంచి తిరిగి అమెరికా చేరుకునే వరకూ అవసరమయ్యే అన్ని ఏర్పాట్లూ చేశారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియాన్ని మోడీ ట్రంప్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ‘నమస్తే ట్రంప్’ పేరుతో స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘట్టంలో మన ‘బాహుబలి’ సినిమా పాట ప్రతిధ్వనించడం తెలుగువారి మనసులు ఉప్పొంగేలా చేస్తోంది. ట్రంప్ పాల్గొనే మొతేరా స్టేడియం లో ఆయనను స్వాగతిస్తూ ‘బాహుబలి’ చిత్రంలోని ‘జైజైకారా’(తెలుగులో దండాలయ్యా) పాటను ప్రముఖ సింగర్ ఖైలాష్ ఖేర్ ఆలపించనున్నారు. దాదాపు స్టేడియంలోని లక్షాపాతిక వేల మంది, ట్రంప్, మోడీ సమక్షంలో ఈ పాట పాడనున్నట్టు ఖైలాష్ తెలిపాడు. ప్రపంచం మొత్తం ఈ ఘటనతో తెలుగు సినిమా పాట ప్రతిధ్వనించనుంది.
ఈ సందర్భం గా కుదిరితే తన పాటతో ట్రంప్ చేత డ్యాన్స్ చేయిస్తానని ఖైలాష్ తెలిపారు. తాజాగా ట్రంప్ ను బాహుబలిగా చిత్రీకరిస్తూ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు బాహుబలి పాటను స్వయంగా ట్రంప్ ముందే పాడుతుండడం విశేషంగా మారింది.