Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు బాహుబలి స్పెషల్‌ షో.. మరి బాబుకు?

By:  Tupaki Desk   |   10 July 2015 9:24 AM GMT
కేసీఆర్‌కు బాహుబలి స్పెషల్‌ షో.. మరి బాబుకు?
X
ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటూ.. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్న బాహుబలి సినిమాకు సంబంధించి రాజకీయం చొరబడనుందా? అన్న సందేహం తాజా పరిణామంతో చోటు చేసుకుంటుందా? అన్న సందేహం కలుగుతోంది.

బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన షోను.. శనివారం రాత్రి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోసం వేయనున్నట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు వేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ షోకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు.. పలువురు తెలంగాణ అధికారపక్ష నేతలు హాజరై చూస్తారని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి స్పెషల్‌ షో వేస్తున్నారు సరే..? మరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వదిలేస్తారా? ఆయనకు కూడా మరో ప్రత్యేక షో ఏపీలో ఏర్పాటు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ.. తెలంగాణ ముఖ్యమంత్రికి స్పెషల్‌ షో వేసి.. ఏపీ ముఖ్యమంత్రికి వేయకుంటే.. బాహుబలి రాజకీయ చట్రంలో ఇరుక్కునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.