Begin typing your search above and press return to search.
జానారెడ్డి నోట బాహుబలి మాట
By: Tupaki Desk | 17 March 2017 2:40 PM GMTకేవలం సినిమా వాళ్లే కాదు.. రాజకీయ నాయకులు.. వ్యాపార దిగ్గజాలు కూడా బాహుబలి ప్రస్తావన తెస్తున్నారు. సందర్భానుసారంగా బాహుబలి పేరు వాడుతున్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బాహుబలి ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేత.. ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి కూడా బాహుబలి మాటెత్తారు.
కష్టకాలంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆదుకోవడానికి బాహుబలి వస్తాడంటున్నారాయన. రాష్ట్రంలో పార్టీని గెలిపించడానికి ఒక బాహుబలి వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్న జానా.. ఇలా ఎవరో వస్తారని కలలు కనడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఆ సంతలా వదిలేస్తే.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ నాశనమవుతోందని .. ఆయనొక ఐరన్ లెగ్ అని వస్తున్న విమర్శలపైనా జానారెడ్డి స్పందించారు. రాహుల్ ఐరన్ లెగ్గో కాదో భవిష్యత్తులో తేలుతుందన్నారు.రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఎప్పుడూ తప్పుడు లెక్కలు.. తప్పులే చెబుతున్నారని.. కాబట్టి అసెంబ్లీలో బడ్జెట్ పై తాను ఇకపై మాట్లాడనని.. వచ్చే ఏడాది బడ్జెట్‌పై మాట్లాడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశమిస్తానని జానారెడ్డి అన్నారు. ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటి వాడినని జానా వ్యాఖ్యానించడం విశేషం.