Begin typing your search above and press return to search.
మోడీపై రాందేవ్ బాబా ఫైర్
By: Tupaki Desk | 29 Nov 2015 7:22 AM GMTప్రధాని నరేంద్ర మోడీని ఎప్పుడూ వెనకేసుకు వచ్చే యోగా గురువు రాందేవ్ బాబా… ఒక్కసారిగా మోడీ సర్కార్ పై విరుచుపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో మోడీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ప్రధానిని ఎత్తిపొడిచారు. మోడీ హామీ విషయాన్ని ప్రస్తావిస్తూనే ప్రస్తుత పాలనతో పోల్చిచూపుతూ విమర్శలు చేశారు.
ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన రాందేవ్ బాబా బ్లాక్ మనీ రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. స్కామ్ లలో కొల్లగొట్టిన డబ్బు ఒకటైతే.. టాక్స్ పేయర్స్ ఎగ్గొట్టింది మరొకటని అన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ఎన్డీయే విఫలమయ్యిందని రాందేవ్ బాబా విమర్శించారు. ఈ ప్రభుత్వం హయాంలోనే బ్లాక్ మనీ మరింత పెరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎన్నికల సమయంలో విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్రమోడీ సర్కార్ నిజంగానే ఆ హామీని నెరవేరుస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. అయితే మోడీ సర్కార్ పై తనకు పూర్తి విశ్వాసముందని రాందేవ్ బాబా ముక్తాయించారు.
ఇటీవల రాందేవ్ బాబా నూడుల్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, పద్మా అవార్డుల విషయంలో రాందేవ్ బాబాను పక్కనపెట్టడం వల్ల బాబా ఈ తరహాలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.