Begin typing your search above and press return to search.
బాబా రామ్ దేవ్ నోట ‘‘అమ్మాయిల’’ మాట
By: Tupaki Desk | 17 Jan 2016 11:13 AM GMTకొంతమంది నోట కొన్ని మాటలు వస్తే కాస్తంత చిత్రంగా ఉంటాయి. కాస్త ఆసక్తికరంగానూ ఉంటాయి. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా యోగా ఎంత అద్భుతంగా చేస్తారో.. వ్యాపారం అంతే జోరుగా చేస్తారు. ఆయన బిజినెస్ ఐడియాలకు పెద్ద పెద్ద మల్టీ నేషన్ కంపెనీలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాయి. కంచుకోట లాంటి కన్యూమర్ మార్కెట్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్ని దెబ్బ తీయటం అంత చిన్న విషయమేమీ కాదు. కానీ.. అలాంటి కష్టమైన వ్యవహారాన్ని ఈజీగా పూర్తి చేశారు రాందేవ్ బాబా.
స్వల్ప వ్యవధిలోనే వేల కోట్ల మార్కెట్ ను సొంతం చేసుకున్న ఆయన తన పతంజలి బ్రాండ్ మీద చాలానే సిత్రాలు చేసి చూపిస్తున్నారు. తాజాగా ఫెయిర్ నెస్ క్రీముల ప్రకటనల మీద ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుళ జాతీయ సంస్థలన్నీ ఫెయిర్ నెస్ క్రీముల మీద మాయ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నాయంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు.
తాను ఎన్నో దేశాలు తిరిగానని.. ఎంతో మంది అమ్మాయిల్ని చూశానని.. కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా ఫెయిర్ నెస్ క్రీములు వాడటంతో ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా తెల్లబడినట్లు తనకు కనిపించలేదని వ్యాఖ్యానించారు. కంపెనీలన్నీతప్పుడు మాటలతో మాయ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమేరా జిమ్మిక్కులతో తెల్లటి అమ్మాయిల్ని.. రంగు తక్కువగా చూపించి.. క్రీములు వాడిన తర్వాత తెల్లగా మారినట్లుగా చూపిస్తున్నారంటే బిజినెస్ ట్రిక్కుల గురించి చెప్పుకొచ్చారు. బాగున్నాయి కదా బాబాగారి అమ్మాయిల మాటలు.