Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుగాలి:రాందేవ్

By:  Tupaki Desk   |   27 Jun 2018 9:34 AM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుగాలి:రాందేవ్
X
యోగా గురు బాబా రాందేవ్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ తో పాటు మిగ‌తా ప్ర‌పంచ దేశాల‌లో యోగాను పాపుల‌ర్ చేసిన ఘ‌న‌త రాందేవ్ కు ద‌క్కుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సంప్ర‌దాయ బ‌ద్ధంగా రాందేవ్ ప్రారంభించిన `ప‌తంజ‌లి ` బ్రాండ్ కూడా బాగా పాపుల‌ర్ అయింది. ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇదే ఊపుతో రాందేవ్ ....వాట్సాప్ కు దీటుగా కింభోను కూడా లాంచ్ చేయ‌బోతున్నారు. `హిందుత్వ‌` విష‌యంలో ప్ర‌ధాని మోదీకి వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంలో రాందేవ్ బాబా కీల‌క‌మైన పాత్ర పోషించార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు `హిందుత్వ‌`తో బీజేపీకి - మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచిన రాందేవ్....తొలిసారిగా మోదీపై నెగెటివ్ టోన్ లో మాట్లాడి అంద‌రికీ షాకిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంద‌ని రాందేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

లండ‌న్ లో యోగా శిక్ష‌ణ కోసం వెళ్లిన రాందేవ్ బాబాను టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహ‌కులు క‌లిశారు. ప్ర‌తిష్టాత్మ‌క టుస్సాడ్స్ లో బాబా రాందేవ్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌నున్న నేప‌థ్యంలో ....రాందేవ్ కొల‌త‌ల‌ను తీసుకునేందుకు వారు రాందేవ్ బాబాను సంప్ర‌దించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన రాందేవ్ బాబా 2019 ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌ష్టాలు త‌ప్ప‌వేమోన‌ని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. దేశంలోని ఓబీసీలు, దళితులు, ముస్లింలు అంతా ఒక‌తాటిపైకి వ‌చ్చి బీజేపీకి ఎదురునిలిస్తే....బీజేపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని అన్నారు. అయితే, వారంతా ఒక‌తాటిపైకి రావడానికి ఉన్న అవకాశాలు చాలా త‌క్కువ‌ని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చని రాహుల్ గాంధీని ఉద్దేశించి రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అయితే, ఎవ‌రైనా ప్ర‌జాభీష్టం ప్ర‌కార‌మే అధికారంలోకి వ‌స్తార‌ని అన్నారు. మోదీకి స‌న్నిహితుడిగా పేరున్న రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.