Begin typing your search above and press return to search.

వాట్సాప్ కు షాక్ ఇచ్చిన రాందేవ్ బాబా

By:  Tupaki Desk   |   31 May 2018 7:19 AM GMT
వాట్సాప్ కు షాక్ ఇచ్చిన రాందేవ్ బాబా
X

తనకు అనుకూలమైన బీజేపీ పాలనలో యోగా గురువు రాందేవ్ బాబా తన వ్యాపారాన్ని విపరీతంగా విస్తరిస్తున్నాడు. ఇప్పటికే పతంజలి ఉత్పత్తులతో దేశీయ రీటైల్ రంగాన్ని షేక్ చేస్తున్న ఈ మత గురువు తాజాగా టెలికాం రంగంలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే.. దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తో జట్టుకట్టిన ఈ యోగా గురువు దేశవ్యాప్తంగా ఉచిత టెలికాం సేవలు అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఉచిత సేవలతో హోరెత్తిస్తున్న జియోకు షాక్ ఇచ్చేందుకు సిమ్ లు కూడా లాంచ్ చేశారు.

ప్రభుత్వ రంగ బీఎస్ ఎన్ ఎల్ తో కలిసి పతంజలి స్వయం సంవృద్ధి సిమ్ కార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్ - ఎస్ ఎంఎస్ లు - డేటా అందించనున్నట్టు రాందేవ్ బాబా ప్రకటించారు.అంతేకాక పతంజలి సిమ్ యూజర్లకు 10 శాతం పతంజలి ఉత్పత్తులపై రాయితీ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉచిత సేవలతో హోరెత్తిస్తున్న జియోకు గట్టి పోటీ ఎదురుకానుంది.

ఇప్పుడు తాజాగా దేశంలో ఎక్కువమంది వాడుతున్న మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు షోక్ ఇచ్చాడు రాందేవ్ బాబా... దేశీయ కొత్త ‘కింభో’ యాప్ ను ఆవిష్కరించారు. ఈ మేరకు పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఇక భారత్ మాట్లాడుతుంది.. వాట్సప్ కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా కోరారు.

ఈ కింభో యాప్ లో ఫ్రీ ఫోన్ - వీడియో కాలింగ్ సదుపాయం ఉంది. వాట్సాప్ లాగే ప్రైవేట్ - గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ఇంకా అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. షేర్ టెక్ట్స్ - ఆడియో - ఫొటోలు - వీడియోలు - స్టిక్కర్స్ - లోకేషన్ - జిఫ్స్ - డూడుల్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ మేరకు వివరాలున్నాయి. ‘ఇక భారత్ మాట్లాడుతుంది ’ అనేది కింభో ట్యాగ్ లైన్ గా ఉంది.