Begin typing your search above and press return to search.

అమిత్ షా...పొలిటిక‌ల్ వెయిట్‌ కు కార‌ణ‌మిదేన‌ట‌!

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:12 AM GMT
అమిత్ షా...పొలిటిక‌ల్ వెయిట్‌ కు కార‌ణ‌మిదేన‌ట‌!
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా... ఇటీవ‌లి కాలంలో దేశ రాజ‌కీయాల్లో కీల‌క వ్య‌క్తిగా మారిపోయారు. దేశంలో ఎక్క‌డ ఏం కావాల‌న్నా... షా ఒక్క చూపు చూస్తే స‌రిపోతుంది అన్నంత‌గా ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఈ బీజేపీ నేత‌... మోదీ గుజ‌రాత్ సీఎంగా ఉండ‌గా, ఆయ‌న కేబినెట్‌ లో షా కీల‌క శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే మోదీ జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో త‌న వెంట అమిత్ షాను కూడా తెచ్చేసుకున్నారు. ఇద్ద‌రిదీ విడ‌దీయ‌రాని బంధంగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌ చెప్పుకుంటున్న వైనం మ‌న‌కు తెలిసిందే.

గ‌తంలో గుజ‌రాత్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే కాకుండా... బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలోనే అమిత్ షా భారీ కాయుడిగా క‌నిపించేవారు. అయితే కాల‌క్ర‌మంలో ఆయ‌న 20 కిలోల మేర‌ బ‌రువు తగ్గిపోయారు. బాగా చిక్కిపోయార‌ని చెప్ప‌లేం గానీ... గ‌తంలో భారీకాయంతో ప‌డిన ఇబ్బంది ఇప్పుడు షా మోములో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే యోగాస‌నాలు ప్రాక్టీస్ చేస్తున్న షా చాలా స్వ‌ల్ప కాలంలోనే 20 కేజీల బ‌రువు త‌గ్గిపోయార‌ట‌. నిన్న ప్ర‌పంచ యోగా దినోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌ముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో క‌లిసి అమిత్ షా ... యోగాస‌నాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా బ‌రువును ప్ర‌స్తావించిన రాందేవ్ బాబా... ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

శ‌రీర బ‌రువు త‌గ్గించుకున్న అమిత్ షా... రాజ‌కీయంగా ప‌లుకుబ‌డిని మాత్రం ఇబ్బడిముబ్బ‌డిగా పెంచేసుకున్నార‌ని బాబా వ్యాఖ్యానించారు. దీనికంత‌టికీ యోగాస‌నాలే కార‌ణ‌మ‌ని చెప్పిన రాందేవ్‌... పొలిటిక‌ల్ వెయిట్ ను పెంచేసుకున్న అమిత్ షా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు మాత్రం టెన్ష‌న్ పెట్టేస్తున్నార‌ని స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. రాందేవ్ బాబా స‌ర‌దాగా ఈ వ్యాఖ్య‌లు చేసినా... వాస్త‌వంగా చూసుకుంటే కూడా అమిత్ షా ఇటీవ‌లి కాలంలో దేశ రాజ‌కీయాల్లో అత్యంత క్రియాశీల‌క నేత‌గా మారిపోయారు. దేశంలో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ల‌భిస్తున్నంత‌టి ప్రాధాన్యం ల‌భిస్తోంది. బీజేపీకి చోటు లేని రాష్ట్రాల్లోనూ పార్టీ జెండాను పాతేందుకు అమిత్ షా చేస్తున్న య‌త్నాలు ఇప్ప‌టికే చాలాచోట్ల స‌త్ఫ‌లితాలు ఇచ్చాయి కూడా. అంటే... అమిత్ షాపై రాందేవ్ బాబా స‌ర‌దాగానే చేసినా... వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గానే మాట్లాడార‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/