Begin typing your search above and press return to search.

ప‌తంజ‌లి జీన్స్ వ‌చ్చేస్తున్నాయ్‌..ప్ర‌త్యేక‌త‌లు ఇవే

By:  Tupaki Desk   |   6 April 2018 2:30 PM GMT
ప‌తంజ‌లి జీన్స్ వ‌చ్చేస్తున్నాయ్‌..ప్ర‌త్యేక‌త‌లు ఇవే
X
చాలామంది నెటిజ‌న్లు స‌రదాకు చేసిన కామెంట్ నిజం అయింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ చ‌మ‌త్కారాన్ని జోడిస్తూ ప‌తంజ‌లి జీన్స్ మార్కెట్లోకి వ‌స్తే ఇలా ఉంటాయి..అలా ఉంటాయి అంటూ జోస్యాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంచ‌నాలు నిజం అయ్యాయి. ఐదేళ్లలో యాభై నుంచి ఏకంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ గార్మెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు.

అడ్వర్‌ టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన గోవా ఫెస్ట్-2018 కార్యక్రమంలో రాందేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తమ సంస్థ వచ్చే ఏడాది దుస్తుల తయారీ విభాగంలోకి ప్రవేశించనుందని వెల్ల‌డించారు. `మార్కెట్ లోకి మీ కంపెనీకి చెందిన జీన్స్ ఎప్పుడు తీసుకొస్తున్నారు? అని కొంతమంది ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో గార్మెంట్ ఉత్పత్తులను లాంచ్ చేయాలని నిర్ణయించాం. వీటిలో చిన్నపిల్లలు - మహిళలు - పురుషులు - సంప్రదాయ వస్ర్తాలను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తాం` అని ఆయ‌న వివ‌రించారు. ఈ దుస్తులు వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా ఉంటాయ‌న్నారు.

స్వదేశీ బ్రాండ్‌తో దుస్తుల తయారీ వ్యాపారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని గతేడాది రాందేవ్ బాబా వెల్లడించిన విషయం తెలిసిందే. దానిపై మ‌రింత వివ‌ర‌ణ ఇస్తూ ఇప్పటికే కాస్మెటిక్ - ఆహార పదార్థాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చామని స్పోర్ట్స్ - యోగా కోసం అవసరమైన దుస్తులను తమ కంపెనీ ఆవిష్కరిస్తుందని బాబా చెప్పారు.