Begin typing your search above and press return to search.

బాబ్రీ మ‌సీదు విధ్వంసంపై అస‌దుద్దీన్ మాట!

By:  Tupaki Desk   |   20 April 2017 4:40 AM GMT
బాబ్రీ మ‌సీదు విధ్వంసంపై అస‌దుద్దీన్ మాట!
X
ఇప్పుడు ఎక్క‌డ చూసినా బాబ్రీ మ‌సీదు విధ్వంసానికి సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా... ఆ పార్టీకి చెందిన కురువృద్ధుడు ఎల్కే అద్వానీపై సుప్రీంకోర్టు విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేస్తూ వెలువ‌రించిన తీర్పు నిజంగానే దేశ ప్ర‌జ‌ల‌కు షాకింగ్ వార్త‌గానే నిలిచింద‌ని చెప్పాలి. ఈ తీర్పుపై అన్ని రాజ‌కీయ పార్టీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ త‌మ‌దైన శైలిలో స్పందించ‌గా... హైద‌రాబాదుకు చెందిన పాత‌బ‌స్తీ షేర్ ఖాన్‌గా పేరొందిన ఆలిండియా మ‌జ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత‌, హైద‌రాబాదు ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన ప్ర‌క‌ట‌న ప‌లువురిని ఆక‌ర్షించింద‌నే చెప్పాలి.

ఎందుకంటే... బాబ్రీ మ‌సీదు విధ్వంసం కేసును ఆయ‌న ఏకంగా జాతి పిత మ‌హాత్మా గాంధీ హ‌త్యోదంతంతో అస‌ద్‌ పోల్చారు మ‌రి. సుప్రీం తీర్పు వెలువ‌డిన త‌ర్వాత హైద‌రాబాదులో మీడియా ముందుకు వ‌చ్చిన అసద్‌... తీర్పుపై త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించారు. గాందీ హ‌త్య‌ - బాబ్రీ మ‌సీదు విధ్వంసం కేసుల‌ను పోల్చి చూస్తే... వాటిలో బాబ్రీ మ‌సీదు విధ్వంసమే తీవ్రమైన నేరంగా ప‌రిగ‌ణించాల్సి ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇందుకు కారణాల‌ను కూడా వివ‌రించారు.

ఈ కేసుపై అస‌ద్ ఏమ‌న్నారన్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే... గాంధీ హత్య ఘటనను రెండేళ్లలో విచారణ జరిపి పూర్తి చేస్తే.. బాబ్రీ కూల్చివేత ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. బాబ్రీ కూల్చివేత ఘటన జాతి సిగ్గుపడాల్సిన అంశం. 1992లో బాబ్రీ విధ్వంసానికి కారకులైనవారే నేడు దేశాన్ని పరిపాలిస్తున్నారు. బాబ్రీ విధ్వంసం ఘటనలో నిందితులు మంత్రి పదవులు పొందడం శోచనీయం, కొందరు పద్మవిభూషణ్‌ లు కూడా అందుకున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె. అద్వానీ - ఎం.ఎం.జోషి - ఉమాభారతిపై కేసు దర్యాప్తును కొనసాగించడానికి సుప్రీంకోర్టు సీబీఐకి అనుమతించడంతో బాబ్రీ విధ్వంసం కుట్రలో వీరు భాగస్వాములని స్పష్టమైంది. రాజస్థాన్‌ గవర్నర్‌ గా వ్యవహరిస్తున్న కల్యాణ్‌ సింగ్‌ కు కేసు నుంచి విముక్తి లభించడం ఆశ్చర్యమే. చట్టాన్ని గౌరవించే వారైతే... మోదీ సర్కారు కల్యాణ్‌ సింగ్‌ ను పదవి నుంచి తొలగిస్తుందా?’’ అని అస‌ద్ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నాస్త్రాల‌ను సంధించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/