Begin typing your search above and press return to search.
బాబ్రీ కేసు: హైకోర్టులో సవాల్ కు ముస్లిం సంఘాల నిర్ణయం?
By: Tupaki Desk | 30 Sep 2020 5:34 PM GMT1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా చారిత్రక తీర్పునిచ్చింది. బీజేపీ కురువృద్ధులు అద్వానీ, జోషి, ఉమాభారతి సహా 32మందిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి.
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాస్తవాలను విస్మరించేలా ఉందని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. సీబీఐ కోర్టు తీర్పుపై ముస్లిం సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తీర్పులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని ముస్లిం సంఘాలు నిర్ణయించారు. తీర్పుపై స్పందించిన ముస్లిం పర్సనల్ లాబోర్డుతోపాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కూడా ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించాయి. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించాయి.
తాజాగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ ఈ సీబీఐ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.