Begin typing your search above and press return to search.
బాబ్రీ కేసు.. ఆ గొంతు మూగబోయింది!
By: Tupaki Desk | 16 Sept 2017 5:40 PM ISTదేశాన్ని పెను కుదుపులకు గురి చేసిన ఉత్తర్ ప్రదేశ్ లోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి హిందువులు కంటతడి పెట్టే ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును ఆది నుంచి ఎంతగానో సమర్ధిస్తున్న, తొలిసారిగా బాబ్రీమసీదు స్థానంలో రామ మందిరం కట్టాలనే వాదనను న్యాయ స్థానం దృష్టికి తీసుకువెళ్లిన మహంత్ భాస్కర్ దాస్ (89) శనివారం ఉదయం గుండె పోటుతో మరణించారు. 1960లలోనే దాస్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రామజన్మభూమి అనే విషయాన్ని అనేక ఆధారాల ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా హిందువులు ఆయనకు బంధువులుగా మారారు.
ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అనేక కీలక మలుపుల్లో దాస్ తనదైన శైలిలో మందిర నిర్మాణానికి కృషి చేశారు. అశోక్ సింఘాల్ ఉన్నప్పుడు ఆయన సాయంతో దాస్ తన వాదనను కోర్టుకు వినిపించారు. అయితే, 89 ఏళ్ల దాస్.. అనూహ్యంగా అనారోగ్యం బారిన పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను ఘజియాబాద్‌లోని హర్ష హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చేర్చారు. ఛాతిలో నొప్పితో పాటు ఉదయం ఆయనకు శ్వాసతీసుకోవడంలో సమస్యలు మొదలయ్యాయి. వైద్యులు ఎంత ప్రయత్నించినా.. ఆయన స్పందించలేదు.
ఈ క్రమంలోనే ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. సరయూ నది తీరంలో అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే నిర్మోహి అఖాడా.. సంస్థకు దాసు ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. రామజన్మభూమి ప్రాంతంపై ఆయన తొలిసారి 1959లో కోర్టు మెట్లు ఎక్కారు. కాగా, దాస్ చనిపోవడంతో హిందు-ముస్లింల తరఫున మొదటి కక్షదారులు చనిపోయినట్లు అయింది. గత ఏడాది ముస్లింల తరఫున వాదిస్తున్న హషీమ్ అన్సారీ(95) చనిపోయారు.