Begin typing your search above and press return to search.

రేపే బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు !

By:  Tupaki Desk   |   29 Sept 2020 8:30 PM IST
రేపే బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు !
X
గత మూడు దశాబ్ధాల క్రితం జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతపై రేపు తీర్పు వెల్లడికాబోతుంది. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో కేంద్రం ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన ఘర్షణలకు తావులేకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఆనాటి ఘటనపై న్యాయస్థానం ఎలా స్పందించనుంది అనేది ఆసక్తిగా మారింది.

1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అది శ్రీరాముడి జన్మస్థానంలో ఆలయాన్ని కూల్చి 16వ శతాబ్ధంలో నిర్మించారంటూ అప్పట్లో పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ కూల్చివేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇటీవల సుప్రీం కోర్టు కూడా అది రామ జన్మభూమిగానే పేర్కొంది. ఈ కూల్చివేత ఘటనలో అప్పటిబీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌, ఉమా భారతి ఉన్నారు.అప్పట్లో వీరిపై కుట్రపూరిత ఆరోపణగా పేర్కొనగా 2001లో దాన్ని కొట్టివేసింది. సుప్రీం కోర్టు జోక్యంతో 2017లో అద్వానీతో పాటు ఇతరులపై నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్ చేశారు. దీనిపై తుది తీర్పు వెల్లడించబోతుంది.