Begin typing your search above and press return to search.
భార్య భువనేశ్వరి తో బాబు తొలిసారి పోరుబాట
By: Tupaki Desk | 31 Dec 2019 7:23 AM GMTఇన్నాళ్లు భర్త చాటు భార్యలా.. గుట్టుగా సంసారం చేసిన అర్థాంగి ఆమె.. చంద్రబాబు తెరవెనుక వ్యాపారాలు చేసుకున్న ఆడపడుచు ఆమె.. భర్తను సీఎంగా చూసింది.. కొడుకును మంత్రిగా చూసి ఉప్పొంగిపోయింది. ప్రతిపక్షంలోకి వచ్చాక భర్త చంద్రబాబు , కొడుకు లోకేష్ పోరాటం చూసి ఉప్పొంగి పోయింది. కానీ చివరకు ఆమె కూడా భర్తతో కలిసి రోడ్డు మీదకొస్తోంది. ఆందోళనల్లో పాలుపంచుకుంటోంది.
భర్త కోరిక మేరకు చంద్రబాబు భార్య భువనేశ్వరి రోడ్డెక్కుతున్న వైనం ఏపీ పాలిటికల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం నుంచి రాజధాని తరలింపు పై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోతున్నారు.తొలిసారి తన భార్య భువనేశ్వరిని ఆందోళనలకు దించుతున్నాడు. కుమారుడు లోకేష్ ఎలాగూ చంద్రబాబుతో ఉద్యమిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు సకుటుంబ సపరివార ఆందోళనలకు ఏపీలో శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది.
అమరావతి రాజధాని రైతులకు మద్దతు గా కొత్త సంవత్సరం 2020 జనవరి 1 నుంచే మన చంద్రబాబు గారు యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. తన ధర్మపత్ని భువనేశ్వరి తో కలిసి సకుటుంబ సపరివారంగా జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నారు. అమరావతి రాజధాని తరలింపునకు నిరసనగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.