Begin typing your search above and press return to search.

బీజేపీకి బాబు బంపర్ ఆఫర్... అంతా ఓకేనే...?

By:  Tupaki Desk   |   15 Sep 2022 11:30 PM GMT
బీజేపీకి బాబు బంపర్ ఆఫర్... అంతా ఓకేనే...?
X
రాజకీయాల్లో ప్రజలు నాయకులకు పార్టీలకు ఆఫర్లు ఇవ్వాలి. వారి దయ ఉంటేనే ఎవరైనా కుర్చీలు ఎక్కేది. దానికంటే ముందు టికెట్లు, పోటీ చేయడాలు, పొత్తులు ఇలా చాలా వ్యవహారాలు మాత్రం నాయకుల చుట్టే తిరుగుతాయి. ప్రజలు ఇదే కోరుకుంటున్నారు అని ముందే ఊహించి ఆ దిశగా అడుగులు వేయడంలోనే రాజకీయ నాయకుల చాణక్యం ఉంటుంది.

ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైన జగన్ని గద్దె దించడానికి చూస్తున్న చంద్రబాబు దాని కోసం ఏ ఒక్క అవకాశాన్ని అసలు వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. దాంతో ఆయన జనసేన బీజేపీలతో కూడా పొత్తు కోరుకుంటున్నారు. జనసేన విషయం పక్కన పెడితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీతో పొత్తుతో చాలా రాజకీయ లాభాలు ఉన్నాయని బాబు ఊహిస్తున్నారు.

దాంతో బీజేపీని తమ దారిలోకి తెచ్చుకోవడానికి వన్ సైడెడ్ గా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రచారంలో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఏకంగా పది ఎంపీ సీట్లను బాబు ఆఫర్ చేశారని, ఈ ఎంపీ సీట్లు కూడా వారు కోరుకున్న చోట ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తుందని బాబు వర్తమానం పంపించారని అంటున్నారు. బీజేపీకి ఎంపీ సీట్లే ముఖ్యం.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కావాల్సినంతమంది ఎంపీలు ఉండాలి. బీజేపీ ఇప్పటికిపుడు ఏపీలో అధికారంలోకి వచ్చేంత సీన్ అయితే లేదు. దాంతో చంద్రబాబు తెలివిగానే ఎంపీల సీట్ల పేరిట ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. పైగా వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్లు అని కూడా బోల్డ్ ఆఫర్ ఇచ్చేశారు. ఈ దెబ్బకు కమలనాధులు కూడా ఫుల్ హుషార్ అవుతారనే టీడీపీ భావిస్తోంది.

ఇక పది ఎంపీ సీట్లు అంటే కచ్చితంగా అందులో నుంచి మెజారిటీ గెలిచుకున్నా బీజేపీకి ఏపీలో గట్టి బలం ఏర్పడినట్లే. పైగా ఈ సీట్లు రేపటి రోజున కేంద్రంలోమూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగపడతాయని బీజేపీ భావించే వీలుంది. 2014 ఎన్నికల వేళ బీజేపీకి అయిదు సీట్లు ఇచ్చిన బాబు ఇపుడు ఆ సంఖ్యను రెట్టింపు చేశారు. అది కూడా బీజేపీ నుంచి ఎలాంటి రాయబేరాలు రాకుండానే అంటే మొత్తం పాతిక సీట్లలో పది సీట్లు అన్న మాట. మరి బీజేపీ ఏమైనా బేరాలు చేస్తే డజన్ దాకా సీట్లు ఇచ్చేలాగానే టీడీపీ ఉంది అంటున్నారు.

మరి ఈ ప్రతిపాదనకు కమలనాధులు ఏమంటారో అన్న ఆసక్తి అయితే ఉందిట. అయితే అందరికీ అర్ధమవుతున్న విషయం బట్టి చూస్తే ఇలాంటి బంపర్ ఆఫర్ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నుంచి వస్తే బీజేపీ అసలు వదులుకోదు అనే అంటున్నారు. ఎటూ రేపటి ఎన్నికల తరువాత తెలుగుదేశం ఎంపీలు కూడా మద్దతుగా ఉంటారు. బీజేపీ సింబల్ తో గెలిచిన వారు కూడా ఏపీ నుంచి పెద్ద నంబర్ లో నెగ్గినట్లు అయితే బీజేపీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అన్న ఆలోచన ఏదో కమలనాధులకు ఉంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.