Begin typing your search above and press return to search.
స్థానికంలో బాబు ప్రచారం.. గట్టెక్కితే సరే.. లేకపోతే...?
By: Tupaki Desk | 7 March 2021 9:30 AM GMTరాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంది. నగర మునిసిపాలిటీ ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. 12 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటిలోనూ నాలుగు కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు.. రెండు పార్టీలూ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి మంత్రులు దూకుడుగా రంగంలోకి దిగితే... టీడీపీ నుంచి ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. ప్రజల మధ్య తిరుగుతున్నారు.
రోడ్ షోలు చేస్తున్నారు. ప్రజలకు ఒంగి ఒంగి దణ్నాలు పెడుతున్నారు. వాస్తవానికి ఫార్టీ ఇయర్స్ అను భవం ఉన్న నాయకుడు, 14 ఏళ్ల సీఎం ఇలా ఒక స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దిగాల్సిన అవసరం ఉందా? అనే చర్చను పక్కన పెడితే.. చంద్రబాబు అంతటి నాయకుడు రంగంలోకి దిగిన తర్వాత.. పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సిన ప్రతిష్టాత్మక పరిస్థితి ఏర్పడింది. 12 కార్పొరేషన్లలో కనీసం సగంలో అయినా.. చంద్రబాబు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమేనా? అనేది చర్చనీయాంశం గా మారింది. చంద్రబాబు ప్రచారానికి కార్పొరేషన్లలో జనాలు ఏమేరకు ఫిదా అవుతారనేది కీలకం.
చంద్రబాబు ప్రచారానికి ప్రజలు ఫిదా అయి.. పార్టీకి పట్టం కడితే.. మంచిదే. ఖచ్చితంగా వచ్చే 2024 ఎన్ని కలకు సంబంధించి పార్టీకి బూస్ట్ వచ్చినట్టుగానే భావించాలి. నేతల మధ్య సఖ్యత పెరగడంతో పాటు.. చంద్రబాబుకు ఇమేజ్ పెరిగి.. మరో పేదళ్ల పాటు ఆయన నాయకత్వానికి ఎదరు ఉండదు కూడా. అయి తే.. అదేసమయంలో ఆయా కార్పొరేషన్లలో టీడీపీ పరాజయం పాలైతే?! ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ఓటమి ఎదురైతే.. చంద్రబాబు ఇమేజ్ అనూహ్యంగా దిగజారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే జరిగితే.. పార్టీ నుంచి వలసలు మరింత పెరిగి... వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం 12 కార్పొరేషన్లలో సగం స్థానాలను చంద్రబాబు కైవసం చేసుకుంటే.. ఒనగూరే ప్రయోజనం కంటే కూడా ఏదైనా తేడా వస్తే.. మాత్రం జరిగే.. ప్రమాదం మాత్రం మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే.... ఈ అంచనాలను ముందుగానే వేసుకోకుండా.. చంద్రబాబు కార్పొరేషన్ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తారా? అనేది కీలక ప్రశ్న. ఏదేమైనా.. కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీకి ప్రాణ ప్రదమే కాదు.. పరిస్థితులను గమనిస్తే. ప్రాణసంకటంగా కూడా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.