Begin typing your search above and press return to search.
బుచ్చయ్య చౌదరి అలక తీర్చటానికి బాబు అన్ని హామీలు ఇవ్వాల్సి వచ్చిందా?
By: Tupaki Desk | 3 Sep 2021 4:45 AM GMTసమస్య ఎదురైనప్పుడు దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా సమస్యకు పరిష్కార మార్గం వెతికే కన్నా.. ముందు దాన్ని ఏదోలా సద్దుమణిగేలా చేస్తారు. మిగిలిన సంగతులు తర్వాత చూద్దామన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇంకొదరు తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. సమస్యను పరిష్కరించరు.. అలా అని పెండింగ్ లో పెట్టరు.. ముందుకు వెళ్లకుండా.. వెనక్కి పోకుండా జాగ్రత్తలు తీసకుంటూ.. అప్పటికి గడిస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తారు.
ఆ కోవలోకే వస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు సమయం సరిపోక అంతర్గత విభేదాల్ని సద్దుమణిగే అంశంపై ఫోకస్ పెట్టరు. చేతిలో పవర్ లేనప్పుడు.. పార్టీకి మరింత డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో లెక్కలు తేల్చకుండా ఉంచుతారు. మొత్తంగా సమస్యల్ని పరిష్కరించే విషయంలో ఆయన ధైర్యంగా వ్యవహరించరన్న పేరుంది. నిజానికి బాబుకున్న అతి పెద్ద బలహీనతల్లో ఇదొకటిగా అభివర్ణిస్తారు. ఇది ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతున్నా.. దీన్ని అధిగమించే విషయంపై ఆయన ఎప్పుడూ ఫోకస్ పెట్టరన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.
దీంతో.. పార్టీలోని పలువురు నిత్య అసంతృప్త వాదులుగా నిలుస్తుంటారు. ఏళ్లకు ఏళ్లు చూసినా బాబులో మార్పు రాని నేపథ్యంలో తమకు తామే మారిపోవాలన్నట్లుగా కొందరు తెలుగు తమ్ముళ్ల తీరు మారిందని చెబుతారు. దీనికి తగ్గట్లే తాజాగా సీనియర్ నేత.. బాబుకున్న గుప్పెడు మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన ఫైర్ బ్రాండ్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనటం.. అవసరమైతే పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సైతం సిద్ధమన్న సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.
తనకు అలవాటైన సాగతీత.. గోరంట్ల ఎపిసోడ్ లో సాధ్యం కాదని అర్థమైన చంద్రబాబు అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఒక టీంను ఆయన ఇంటికి పంపటం.. అలకను తీర్చే బాధ్యతను వారి మీద పెట్టటం తెలిసిందే. అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. ఇక.. ఊహాగానాలకు అయితే.. కళ్లాలు తెగిన గుర్రాల మాదిరి పరుగులు తీశాయి. అయితే.. సీనియర్ నేత కావటంతో గోరంట్ల కాస్తంత సంయమనం వహించటంతో పార్టీకి.. అధినేత బాబుకు భారీగా డ్యామేజ్ జరగలేదని చెప్పాలి.
పార్టీ టీం గోరంట్ల ఇంటికి వెళ్లిన తర్వాత శాంతించిన గోరంట్ల తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కొందరు పార్టీ సీనియర్లు వెంట ఉండటం గమనార్హం. మంగళగరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన వారితో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేసిన గోరంట్ల.. తన అలకకు కారణాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. సమస్యల్ని పరిష్కరించే విషయంలో బాబు మరింత చొరవను ప్రదర్శించాలన్న సూచనను చెప్పినట్లుగా తెలుస్తోంది.
గోరంట్ల ఇంటికి వెళ్లిన పార్టీ నేతలు.. ఆయన డిమాండ్లకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే కదా. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం తాజాగా బాబు - గోరంట్ల భేటీ సాగినట్లు చెబుతున్నారు. తమ భేటీలో గోరంట్ల చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నట్లు చెబుతారు. ఇక.. ఆయన డిమాండ్ల విషయానికి వస్తే.. త్వరలో పయ్యావుల కేశవ్ కు అప్పజెప్పిన పీఏసీ ఛైర్మన్ పదవిని తాను ఆశిస్తున్నట్లుగా గోరంట్ల చెప్పినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. త్వరలో జరిగే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ.. ఇతర వ్యవహారాల్లోనూ తన మాట చెల్లుబాటు అయ్యేలా హామీ ఇవ్వాలని ఆయన కోరగా.. అందుకు తాను సానుకూలంగా ఉన్నట్లు చంద్రబాబు సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో నిజం ఎంతన్నది తేలాల్సి ఉంది. తాను కోరుకున్న వాటికి ఓకే అన్నట్లుగా వాతావరణం ఉండటంతో అలక వీడిన ఆయన.. అంతకు ముందు ఆవేశంతో చేసిన రాజీనామా వ్యాఖ్యల్ని ప్రస్తావించటం లేదంటున్నారు.