Begin typing your search above and press return to search.
టీవీ చానల్ నుంచి వేణుస్వామి వాకౌట్
By: Tupaki Desk | 22 Dec 2017 5:57 AM GMTప్రముఖ జ్యోతిష్యుడు, రాజకీయవర్గాల్లో పాపులర్ అయిన వేణుస్వామి ఓ టీవీ చానల్ చర్చ నుంచి వాకౌట్ చేశారు. ప్రముఖ హేతువాది బాబు గోగినేనితో జరిగిన చర్చల సమయంలో ఆయనతో విబేధిస్తూ...`నాకు జ్యోతిష్యం రాదు..నన్ను నమ్మకండి` అని ప్రకటిస్తూ లైవ్ లో నుంచే వేణు స్వామి వాకౌట్ చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ టీవీ చానల్ వేణుస్వామితో లైవ్ లో చర్చ నిర్వహిస్తుండగా అందులోకి బాబు గోగినేని ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జ్యోతిష్యాన్ని తప్పుపట్టారు. వేణుస్వామి జ్యోతిష్యాన్ని, ఆయన ప్రకటనలను ఖండించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కూడా తన ప్రచారానికి వేణు స్వామి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయనతో దిగిన మార్ఫింగ్ ఫొటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కళ్యాణ్ గుత్తికొండ అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం సేకరించగా...ప్రధాని మోడీతో వేణుస్వామి ఎలాంటి ఫొటో దిగలేదని తేలిందని అది బయట పడిన తర్వాత నకిలీ ఫోటోను తొలగించిన వేణు స్వామి ఆయనను బెదిరించాడని బాబు గోగినేని ఆరోపించారు. దీనిపై వేణుస్వామి తన వివరణ ఇచ్చారు. బాబు గోగినేని హిందూ మతానికి వ్యతిరేకి అని మండిపడ్డారు.
అనంతరం వారి మధ్య జ్యోతిష్యంపై మళ్లింది. జ్యోతిష్యం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని బాబు గోగినేని చెప్పారు. జ్యోతిష్యాన్ని వ్యతిరేకించడం మతానికి వ్యతిరేకం కాదు...మోసానికి వ్యతిరేకం అని ఆయన తెలిపారు. వివేకానందుడు, దయానంద సరస్వతి సైతం వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో వారి మధ్య పలు అంశాలపై మాట మాట పెరిగి వేణుస్వామి లైవ్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమయ్యారు. `నేను చెప్పేవి తప్పులు. నన్ను నమ్మకండి. నమ్మేవారు నమ్మండి లేకపోతే...లేదు. ఏ చర్చ అయినా....బాబు గోగినేది వ్యక్తిగతంగా ఎదురుదాడి ఉంటుంది.నా చర్చను ఫాలో అయి నన్ను వెతుక్కుంటూ వచ్చారంటేనే అర్థం అవుతోంది.నాకు జ్యోతిష్యం రాదని అనుకున్న తర్వాత నమ్మకండి. ఆయన చెప్పిందే నమ్మండి.నేను చెప్పేది నిజాలు కాదు` అని ప్రకటిస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు.