Begin typing your search above and press return to search.

మోడీకి మంట పుట్టే లేఖ రాసిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   13 May 2018 8:57 AM GMT
మోడీకి మంట పుట్టే లేఖ రాసిన చంద్ర‌బాబు
X
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. ప్ర‌ధాని మోడీకి మ‌ధ్య ట‌ర్మ్స్ అంత స‌రిగా లేవ‌న్న విష‌యం తెలిసిందే. హోదా విష‌యంలో ఏపీ స‌ర్కార్ కు మోడీ స‌ర్కారుకు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌టం.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు సంధించుకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ఏపీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌ని..బాబుకు చుక్క‌లు చూపిస్తామంటూ బీజేపీ నేత‌లు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్న వేళ‌.. ఏపీ స‌ర్కార్ అనూహ్యంగా స్పందించింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక స్పందించేది త‌ర్వాత‌.. అంత‌కంటే ముందే తామే రియాక్ట్ అవ్వాల‌నుకున్నారో ఏమో కానీ.. బాబు స‌ర్కారు మోడీ ప్ర‌భుత్వానికి ఒక లేఖ రాసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కేంద్ర సంస్థ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్ని త‌మ ప్ర‌భుత్వానికి తిరిగి ఇచ్చేయాల‌ని కోరింది. ఈ మేర‌కులేఖ రాయ‌టం క‌ల‌క‌లాన్ని రేపుతోంది.

అమ‌రావ‌తిలో కేంద్ర ప్ర‌భుత్వం కేంద్రీయ విద్యాల‌యం.. ఎస్ బీఐ.. ఎల్ఐసీ.. ఎఫ్ సీఐ.. పోస్ట‌ల్.. ప‌బ్లిక్ వ‌ర్క్స్ సంస్థ‌ల్ని ఏర్పాటు చేయ‌కుండానే కేంద్రం రాష్ట్రం ఇచ్చిన భూముల్ని తీసుకుంద‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. భూములు తీసుకున్న మూడు నెల‌ల్లోపు నిర్మాణాలు ప్రారంభించాల‌ని.. లేదంటే రాష్ట్ర స‌ర్కారు ఇచ్చిన భూముల్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏళ్లు గ‌డిచాన కేంద్రీయ సంస్థ‌లు కొన్ని త‌మ సంస్థ‌ల్ని నెల‌కొల్ప‌లేద‌ని.. కానీ భూములు మాత్రం తీసుకున్నార‌న్నారు. ఈ నేప‌థ్యంలో తాము నోటీసులు ఇచ్చిన‌ట్లుగా ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే.. నాలుగేళ్లుగా అమ‌రావ‌తిలో నిర్మాణాల‌పై మౌనంగా ఉన్న చంద్ర‌బాబు.. ఇప్పుడేదో గుర్తుకు వ‌చ్చిన‌ట్లుగా లేఖ రాసి.. నోటీసులు పంప‌టం చూస్తుంటే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు చెప్పిన మాట‌ల నేప‌థ్యంలోనే బాబు ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.