Begin typing your search above and press return to search.
బాబు హడలి పోతున్నారు.. ఎందుకో తెలుసా ?
By: Tupaki Desk | 18 April 2021 3:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు హడలి పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్లు. ఇదేదో వైసీపీ నేతల నుంచో.. ఇతర పార్టీ నేతల నుంచో వస్తున్న మాట కాదు. ఏకంగా టీడీపీ సీనియర్ల నుంచే వినిపిస్తున్న మాట. ``ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనేమీ చేయలేరు. అందుకే మావోళ్లు ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉన్నారు``-ఇదీ.. విజయవాడకు చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పిన మాట. దీనికి కారణం ఏంటి ? ఎందుకు ? అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు .. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటున్నారు. ఎవ్వరూ కూడా చంద్రబాబు, పార్టీ అధిష్టానం మాట వినడం లేదు. ఒకప్పుడు బాబు గారు మీకు ఈ మాట చెప్పామన్నారంటేనే నేతలు వేదవాక్కుగా తీసుకునేవారు. ఇప్పుడు బాబే స్వయంగా చెపుతున్నా ఈ చెవితో విని..ఆ చెవితో వదిలేస్తున్నారు.
ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. నిజానికి దీనిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ సిట్టింగ్ సీటే కనుక.. ఇక్కడ వైసీపీ గెలుస్తుందన్నది అందరి అంచనా. పైగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ప్రజలు కూడా ఆ పార్టీకే ఓటేసే అవ కాశం ఉంది. అయినప్పటికీ.. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. లోకేష్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడే పదిహేను రోజులుగా మకాం వేసి మరీ ప్రచారం చేసింది. దీనికి పెద్ద రీజన్ ఉందని అంటున్నారు సీనియర్లు. `మాకు అన్నీ తెలుసు. ఇక్కడ మాకు వచ్చేది ఏంటో పోయేదేంటో తెలియకకాదు`` అని విజయవాడ నాయకుడు చెప్పాడు.
పార్టీలో ఇప్పుడు ఒకవిధమైన అస్థిరత ఉంది. అంతా కూడా ఓ నాయకుడు చెప్పినట్టు నడుస్తోంది. దీనిని చాలా మంది విభేదిస్తున్నారు. అందుకే.. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి.. పార్టీ నేతలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. తిరుపతిలో కనుక ఏ మాత్రం తాము ఆశించిన సీట్లు వచ్చినా.. చంద్రబాబు సక్సెస్ అయినట్టే. అయితే.. నేతలు దారిలోకి వస్తారు. లేదంటే.. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగానే ఉన్నారు. కానీ, తప్పులు చేస్తున్నవారిని.. లేదా నోరు పారేసుకుని.. పార్టీ పరువును తీస్తున్నవారిని మాత్రం ఆయన ఏమీ అనరు. అని సదరు నాయకుడు వివరించారు.
ఏదేమైనా పార్టీలో అంతర్గతంగా జరుగుతోన్న పరిణామాలు, ఆయన్ను నేతలు నమ్మకపోవడం, ఆయన నేతలను నమ్మకపోవడం ఇప్పుడు బాగా ఎక్కువైందనే పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అంటే.. నేతలకు చంద్రబాబు హడలిపోతున్నారా? అంటే.. ఔననే చెబుతున్నారు. మరి తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీడీపీలో మార్పులు ఖాయమనే వాదనకు ఇది నిజమేనని అనిపిస్తోంది.