Begin typing your search above and press return to search.

బాబు పంచ్ బాగుంది కానీ.. లాజిక్కు మిస్ అయ్యారు

By:  Tupaki Desk   |   31 Jan 2020 2:30 PM GMT
బాబు పంచ్ బాగుంది కానీ.. లాజిక్కు మిస్ అయ్యారు
X
టీడీపీ అధినేత బ్రహ్మండమైన రహస్యాన్ని బయటకు తీశారు. తనలాంటి మేధావికి మాత్రమే సాధ్యమయ్యే ఈ అంశాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు. చూశారా..? నేను మాత్రమే ఇలాంటి బ్రహ్మాండాల్ని బద్ధలు కొట్టగలన్నట్లుగా ఒక లుక్ వేశారు. బాబేంది? పంచ్ వేయటం ఏమిటని లోతుల్లోకి వెళ్లి చూస్తే.. అసలు విషయం అర్థం కావటమే కాదు.. ఆయన అమాయకత్వానికి అయ్యో అనుకోవాల్సిన పరిస్థితి.

ఇంతకూ ఏమైందంటే.. ఏపీలో పింఛన్ లబ్థిదారుల వయసు ను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. నలభై ఐదేళ్లకే బీసీ..ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వం.. ఎనిమిది నెలల్లో ఏడు లక్షల పింఛన్లకు కోత పెట్టటాన్ని వీరావేశంతో బాబు ప్రశ్నిస్తున్నారు.

వయసు తగ్గించినప్పుడు అర్హుల సంఖ్య పెరుగుతుంది కానీ.. తగ్గటమేమిటన్న లా పాయింట్ బయటకు తీశారు. కేంద్రం ఇచ్చిన రూ.6వేలకు అదనంగా రూ.12500 ఇస్తామని రైతుల్ని మోసం చేశారని.. ఇప్పుడు పింఛన్ల విషయంలోనూ మాట తప్పారని చెప్పుకొచ్చారు. ఇంత మోసకారి కాబట్టే.. 12 ఛార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారంటూ.. పంచ్ ల మీద పంచ్ లు వేసే అవకాశాన్ని అస్సలు మిస్ కాలేదు చంద్రబాబు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన మిస్ అయిన పాయింట్ ఏమంటే..లబ్థిదారుల పేరుతో తమ పార్టీ కార్యకర్తలకు.. మద్దతుదారులకు.. అనర్హులకు కట్టబెట్టిన మోసాన్ని గుర్తించి.. అలాంటి వాటిని తీసివేసినప్పుడు సంఖ్య ఎందుకు పెరుగుతుందన్నది బాబు మర్చిపోయినట్లున్నారు.

నిజంగానే లబ్థి దారులకు మేలు జరగక ఉంటే ఈ పాటికి వారు రోడ్ల మీదకు వచ్చేవారు. మరి.. ఏడు లక్షల మంది పింఛన్ దారులకు పింఛన్లు కట్ చేసినా వారు కిమ్మనకుండా ఉన్నారంటే అనర్హులకు ఏ స్థాయిలో బాబు ప్రభుత్వం దోచి పెట్టిందోనన్న డౌట్ రాక మానదు. తన మాటల్లో మిస్ అయిన లాజిక్కు మీద ప్రజలు కాస్త ఆలోచిస్తే.. తన బండారం బయపడుతుందన్న భయం లేకుండా ఎదురుదాడి చేసే బాబు తీరుకు మాత్రం ఫిదా కావాల్సిందే.