Begin typing your search above and press return to search.
బాబు రైట్ హ్యాండ్.. సైలెంటయ్యాడు..!
By: Tupaki Desk | 22 Nov 2019 9:18 AM GMTటీడీపీని ముందుండి నడిపించాడు.. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించాడు. మంత్రిగా ఐదేళ్లు చంద్రబాబు సర్కారులో చక్రంతిప్పాడు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన తన శిష్యురాలు చేతిలోనే ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన ఆ నేత ఉలుకూ పలుకూ లేకుండా పోయారు. ఏంటి విధి వైపరీత్యం అని చంద్రబాబు, టీడీపీ నేతలు కోరుతున్నా ఆ నేత టీడీపీలో యాక్టివ్ కావడం లేదట..
ప్రత్తిపాటి పుల్లరావు.. టీడీపీలో సీనియర్ నేత.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మంత్రిగా అన్నింట్లోనూ ముందుండేవారు. కానీ ఒక్క ఓటమి ప్రత్తిపాటిని రాజకీయాలకు దూరంగా జరిపింది. తన శిష్యురాలు చేతిలోనే ఓడిపోవడం ఆయన జీర్ణించుకోవడం లేదట.. దీంతో టీడీపీలో మౌనం దాల్చి సైలెంట్ గా ఉండిపోతున్నారు.
పల్నాడులో ఫైర్ బ్రాండ్ అయిన పుల్లారావు.. పల్నాడు పులిగా కీర్తించిన మాజీ స్పీకర్ కోడెల మరణం తర్వాత టీడీపీకి పూర్తిగా దూరం జరిగారట.. లోకేష్ పర్యటనకు కూడా హాజరు కాకపోవడంతో ఈయన పార్టీ మారుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట..
చిలకలూరిపేటలో ఉండే ప్రత్తిపాటి ఇప్పుడు హైదరాబాద్ కు మకాం మార్చారు. తన నియోజకవర్గానికి అస్సలు రావడం లేదు. జిల్లాలో వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ విమర్శలు చేసినా స్పందించడం లేదు. ఈయన బీజేపీ కండువా కప్పుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా బాబు రైట్ హ్యాండ్ గా మెదిలిన నేత ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జరగడం పల్నాడు పాలిటిక్స్ లో హీట్ పెంచింది.