Begin typing your search above and press return to search.
నీతులు చెప్పే బాబు.. తాను చేసిన ద్రోహాన్ని మరిచారా?
By: Tupaki Desk | 20 Sep 2020 5:15 AM GMTప్రపంచంలో అత్యంత తేలిక పని ఏమైనా ఉంటుందా అంటే? అది.. కచ్ఛితంగా నీతులు చెప్పటమేనని చెప్పాలి. రూపాయి ఖర్చు లేకుండా అదే పనిగా చెప్పే మాటలు చెప్పేందుకు బాగానే ఉన్నా.. వాటిని అమలు చేయటంలోనే అసలు చిక్కంతా ఉంటుంది. ఏపీ విపక్ష నేత కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కాలంలో అదే పనిగా నీతులు వల్లిస్తున్నారు.
పార్టీ తరఫున గెలిచిన వారు.. వేరే పార్టీకి వెళ్లటం.. అధికార పార్టీకి అండగా నిలవటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ది చెబుతారన్న ఆయన.. జంపింగ్ నేతల పై శాపనార్థాలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అధికార పార్టీకి మద్దతు ఇవ్వటాన్ని ఆయన తప్పు పట్టారు.
స్వార్థంతో ఒకరిద్దరునేతలు పోయినా పార్టీకి నష్టం వాటిల్లదని.. పార్టీకి నేతలు కాదు.. కార్యకర్తలే కీలకమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ జెండా మోసి గెలిపించేది కార్యకర్తలేనని.. నేతలు కాదన్న ఆయన.. కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నట్లుగా మండిపడ్డారు. బాబు వెర్షన్ విన్నప్పుడు నిజమే కదా? అనిపించక మానదు. కానీ.. అధికారం చేతిలో ఉన్నప్పుడు బాబు చేసిన పనేమిటి?
సొంత పార్టీ నేతల్ని పక్కన పెట్టి.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయటం.. వారికి పదవులు.. అధికారాలు అప్పజెప్పటం.. ఏళ్లకు ఏళ్లు పార్టీని నమ్ముకొని ఉన్న వారికి హ్యాండ్ ఇవ్వటం లాంటి వాటిని ఏమనాలి? అన్నది ప్రశ్న. తాను పవర్లో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజీతో పాటు.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయాలన్న ఆలోచనల మధ్య దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేయటం బాబుకు అలవాటే.
ఈ కారణంతోనే హెలికాఫ్టర్ నేతలకు.. లాబీయింగ్ చేసే వారికి మేలు చేయటమే తప్పించి.. పార్టీ కోసం జెండాలు మోసిన వారికి పెద్దగా చేసిందేమీ లేదని బాబును చెడామడా తిట్టేసే వారెందరో తెలుగుదేశం పార్టీలో. విలువల గురించి నిత్యం మాట్లాడటమే కానీ పాటించని బాబు.. ఇప్పుడు నీతులు చెప్పటమా? అన్న విమర్శ పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. విలువల గురించి మాట్లాడే వ్యక్తి.. తాను అందుకు అర్హుడినేనా? అన్న ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు ఈ ప్రశ్నను పదే పదే వేసుకోవటం చాలా మంచిది.