Begin typing your search above and press return to search.
వైసీపీ నియోజకవర్గాల్లో బాబు టూర్
By: Tupaki Desk | 15 Jun 2022 7:42 AM GMTఉత్తరాంధ్రకు చంద్రబాబు ఈ రోజు (బుధవారం, జూన్ 15, 2022) వస్తున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు పర్యటించి, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చోడవరం, అనకాపల్లి, అదేవిధంగా విజయ నగరం జిల్లాలో నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలపై ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
గత ఎన్నికలలో ఈ 4 స్థానాలనూ వైసీపీనే కైవసం చేసుకుంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్స ప్రధాన అనుచరులు.ఆయన బంధువు కూడా ! అదేవిధంగా చీపురుపల్లి నియోజకవర్గానికి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కావాల్సిన ఆవశ్యత ఉంది. నెల్లిమర్ల టీడీపీ నుంచి పతివాడ కుటుంబం టికెట్ ఆశిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి మనవడు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఇక్కడి వైసీపీని ఢీ కొనడం అంత సులువు పని అయితే కాదు.
అదేవిధంగా చీపురుపల్లిలో యంగ్ టర్క్ కిమిడి నాగార్జున (మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు) యాక్టివ్-గా ఉన్నారు.ఆయనకు టికెట్ కన్ఫం అయిందన్న వార్తలు వస్తున్నాయి. బలమైన ప్రత్యర్థి అయిన బొత్సను ఢీ కొనడం అనుకున్నంత సులువేం కాదు.
కనుక చంద్రబాబు తన రోడ్ షో ను ఈ రెండు నియోజకవర్గాలకూ పరిమితం చేశారు. ఇదేవిధంగా విశాఖ జిల్లాలో కూడా రివ్యూ మీటింగులతో పాటు., మినీ మహానాడు నిర్వహణను చోడవరంలో నిర్వహించనున్నారు.
తొలుత మినీ మహానాడు పూర్తి అయితే, అనకాపల్లిలో నియోజకవర్గాల వారీగా రివ్యూ ఉంటుంది. కనుక ఈ రెండు కార్యక్రమాలనూ విజయవంతం చేసేందుకు తమ గోడు చెప్పుకునేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక నేతలు దృష్టి సారిస్తున్నారు.