Begin typing your search above and press return to search.
ఇది.. మన కేంద్ర మంత్రిగారి లవ్ స్టోరీ
By: Tupaki Desk | 17 Jun 2016 4:48 AM GMTప్రేమకథలు మామూలే అయినా.. సినిమాటిక్ ప్రేమకథలు.. అది కూడా కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి లవ్ స్టోరీ కాస్త అరుదే. తాజాగా మోడీ క్యాబినెట్ లో పట్టణాభివృద్ధి.. హౌసింగ్ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాబుల్ సుప్రియో ప్రేమలో పడిపోయారు. ఒక ఎయిర్ హోస్టెస్ ఆయన మనసును దోచుకుంది. 46 ఏళ్ల ఈ మంత్రిగారు బాలీవుడ్ సింగర్ గా ఉన్నప్పుడే ఎయిర్ హోస్టెస్ ప్రేమలో పడ్డారట. ఇటీవలే ఎంగేజ్ మెంట్ పూర్తి అయి.. ఆగస్టులో వీరి పెళ్లి జరగనుంది. కేంద్రమంత్రిగారి లవ్ స్టోరీ సినిమాటిక్ గా ఉండటం గమనార్హం.
ప్రఖ్యాత యోగా గురువురాందేవ్ బాబాతో జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు తొలిసారి ఎయిర్ హోస్టెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న రచనను చూసి ఫ్లాట్ అయ్యారట. కోల్ కతా నుంచి ముంబయి వెళుతున్న విమానంలో తన పొలిటికల్ కెరీర్ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో రచన పరిచయమైందని ఆయన చెప్పుకొచ్చారు.
2014 ఎన్నికల్లో తన లోక్ సభ అభ్యర్థిత్వం గురించి రాందేవ్ బాబాతో విమానంలో చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె జోక్యం చేసుకొని.. టికెట్ వస్తే విజయం కన్ఫర్మ్ అంటూ చెప్పటంతో అక్కడికక్కడే తన మనసును అర్పించుకున్నట్లు చెబుతున్నారు. ఒక ఎయిర్ హోస్టెస్.. తొలి పరిచయంలోనే అంతలా జోక్యం చేసుకున్నారా? అన్న డౌట్ ను ఈ లవ్ స్టోరీలో మదిలోకి రాకుండా ఉండే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా తొలిసారి రచనను చూసిన సుప్రియో ఆమెపై మనసు పడటం.. తర్వాతి కాలంలో తనకు టికెట్ రావటం.. ఎంపీగా గెలవటమే కాదు.. కేంద్రమంత్రగా బాధ్యతలు చేపట్టే అద్భుత అవకాశం రావటం లాంటివి వెంటవెంటనే జరిగిపోయాయి.
వీటికి తగ్గట్లే వీరి లవ్ స్టోరీ కూడా అంతే స్పీడ్ గా దూసుకెళ్లిపోయింది. 46 ఏళ్ల మంత్రిగారికి 1995లోనే పెళ్లి జరిగినా.. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో 2006లో విడాకులు తీసుకొని ఉన్నారు. సో.. మంత్రిగారి ప్రేమ కథ సాఫీగా పట్టాల మీదకు ఎక్కటానికి ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేవని చెప్పాలి. ఏమైనా కేంద్రమంత్రిగారి లవ్ స్టోరీ సినిమాటిక్ గా లేదూ..?