Begin typing your search above and press return to search.

హోంమంత్రి ఆమెను అలా టచ్ చేశాడు

By:  Tupaki Desk   |   22 April 2016 1:27 PM GMT
హోంమంత్రి ఆమెను అలా టచ్ చేశాడు
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మధ్య ప్రదేశ్ హోం మంత్రి.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బాబూలాల్ గౌర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బస్సెక్కుతున్న ఓ మహిళ పిరుదులను ఆయన టచ్ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం భోపాల్ లో మంత్రిగారు ఒక లో ఫ్లోర్ బస్సును ప్రారంభించారు. ఆ సందర్భంగా ఓ సభ ఏర్పాటు చేశారు. అది పూర్తయ్యాక అక్కడి జనాలందరూ ఒక్కొక్కరుగా బస్సు ఎక్కారు. ఐతే ఓ మహిళ బస్సు ఎక్కబోతుంటే మంత్రి ఆమెకు సాయం చేస్తున్నట్లు చేత్తో పిరుదుల్ని తాకారు. దీంతో ఆ మహిళచేతులతో వెనక్కి విసిరి కొట్టింది. ఇదంతా వీడియోలో రికార్డలయింది. అది నెట్టింటికి కూడా వచ్చేసింది. దీంతో మంత్రి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఐతే గౌర్ మాత్రం తానేమీ అది కావాలని చేయలేదని అంటున్నారు.

85 ఏళ్ల బాబూలాల్ గౌర్ కు గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఘన చరిత్ర ఉంది. పదిసార్లు చట్టసభలకు ఎన్నికైన ఆయన గతంలోనూ పలుమార్లు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యపానం తప్పేమీ కాదని... అది భారతీయుల ప్రాథమిక హక్కని ఓసారి ఆయన పేర్కొనడం గమనార్హం. ఓసారి చెన్నైకి వచ్చి.. దక్షిణాది మహిళలు చక్కగా డ్రెస్ చేసుకుంటారు కాబట్టే ఇక్కడ రేప్ కేసులు తక్కువ అని కూడా అన్నారీ పెద్దాయన.