Begin typing your search above and press return to search.
27 ఏళ్లకు నెలలు నిండాయి.. బిడ్డకోసం సుధీర్ఘ నిరీక్షణ ..!
By: Tupaki Desk | 5 Dec 2020 2:30 AM GMTతొమ్మిది నెలలు పూర్తయ్యాక ప్రసవం జరగడం సాధారణ విషయమే. కాకపోతే ఓ నెల అటో ఇటో అవుతుంది. కానీ ఓ బిడ్డ పుట్టేందుకు దాదాపు 27 ఏళ్లపాటు పట్టింది. గర్భస్థ పిండం 27 ఏళ్ల తర్వాత బిడ్డగా రూపాంతరం చెందింది. నిజానికి వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం. ఆ బిడ్డకోసం 27 ఏళ్లు నిరీక్షించాల్సి ఎందుకు వచ్చిందో.. ఇంత సుధీర్ఘ కాలం తర్వాత ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. మోలీ అనే పసికందు ఈ ఏడాది అక్టోబర్లో జన్మించింది. కానీ ఆమె గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఆ పిండాన్ని ఇన్నేళ్లపాటు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంచారు.
అమెరికాలోని టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డుకెక్కారు, ఈ అరుదైన పద్ధతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే తాను కూడా గడ్డకట్టించిన పిండం నుంచే జన్మించింది.
అమెరికాలో ‘ఎంబ్రోయో డొనేషన్’ అనే విధానం అమల్లో ఉంది. ‘ఎంబ్రోయో డొనేషన్ ప్రకారం తల్లిదండ్రులు గర్భస్తపిండాలను దత్తత తీసుకోవచ్చు. తమ వద్ద గడ్డకట్టిన స్థితిలో ఉన్న గర్భస్థ పిండాలను వైద్యులు సదరు తల్లిదండ్రులకు అందిస్తారు. వారు ఈ పిల్లలను పెంచుకుంటారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంది. ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది.
ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్‌ఈడీసీ) అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది. చాలామంది జంటలు ఇలా ఎంబ్రోయే డొనేషన్ చేస్తారు. అంటే తాము పిల్లలను కనకుండా గర్భస్థ పిండాలను దానం ఇస్తారు,. ఈ గర్భస్థ పిండాలను గడ్డగట్టిన స్థితిలో నిలువ ఉంచి కొద్ది రోజుల తర్వాత ఎవరైనా కోరితే బిడ్డగా మారుస్తారు. ఈ అరుదైన విధానం అమెరికాలో అందుబాటులో ఉన్నది. నిజానికి ఇది చాలా కష్టతరమైన పని. అంతేకాక ఖర్చుతో కూడుకున్నది కూడా.