Begin typing your search above and press return to search.
ఇది ప్రపంచంలోనే అత్యంత వింత డెలివరీ
By: Tupaki Desk | 4 Sep 2017 4:59 PM GMTగర్భాదారణ అనంతరం సుఖప్రసవం కావాలని సంబంధిత మహిళ కుటుంబ సభ్యుల్లో ఎంత ఉత్కంఠ ఉంటుందో అనుభవించిన వారికే తెలుసు. ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైతే ఇటు తల్లికి అటు బిడ్డకు ఇద్దరికీ ముప్పే. ప్రసవం అయ్యే సమయాల్లో ముఖ్యంగా ఎదురయ్యే సమస్య...నెలలు నిండకుండా బిడ్డ జన్మించడం. తొమ్మిదినెలలు పూర్తికాకుండానే జన్మించి బిడ్డ ఆరోగ్య స్థితిగతులపై చాలా టెన్షన్ ఉంటుంది.
అయితే ఇటీవలి కాలంలో వారం నుంచి నాలుగు నెలల ముందు బిడ్డ జన్మించిన ఉదంతాలు కొన్ని ఉన్నాయి. అయితే మూడు నెలల ముందే బిడ్డ జన్మిస్తే...అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కదా. అలాంటి ఆశ్చర్యకరమైన ఉదంతానికి రేలిన్ స్కర్రీ - ఇయాన్ దంపతులు సాక్షులుగా నిలిచారు. కొన్నేళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ఇప్పటికే ఒక పాప కాగా...ఇటీవల స్కర్రీ గర్భం దాల్చింది. దైనందిన వ్యవహారాల్లో భాగంగా స్కర్రీ కారులో వెళుతుండగా...పొత్తికడుపులో నొప్పి ప్రారంభమైంది. అయితే గర్భిణిగా ఇది సహజమే అనుకొని ఆమె తమాయించుకుంది. కానీ మరింతగా నొప్పి పెరిగిపోతుండటంతో తన ప్రయాణం పక్కనపెట్టి ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమైంది. దవాఖనకు రావాలని భర్తకు ఫోన్ చేసింది. అయితే కారును నడుపుకుంటూ ఆస్పత్రికి చేరేలోగానే స్కర్రీ డెలివరీ అయింది. డ్రైవింగ్ చేస్తున్నందున బిడ్డ ఆమె చేతిలో పడింది. అయితే అత్యంత ఆసక్తికరంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటూ ఇటూ కదలడానికి, ఒత్తిడి నుంచి రక్షణగా - ఆహారం - శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే రక్షణ పొరతో ఆ శిశువు తన తల్లి ఒడిలో పడింది.
ఈ పరిణామం స్కర్రీని ఆశ్చర్యానికి లోను చేసింది. అందుకే ఈ ప్రత్యేకతను అందరికీ చాటాలని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో వైరల్ అయింది. తనకు దక్కిన ప్రత్యేక అనుభూతి గురించి స్కర్రీ స్పందిస్తూ ప్రతి 80 వేల ప్రసవాల్లో ఇలాంటి అరుదైన ఘటన జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు వివరించాయని తెలిపింది. నెలలు నిండకముందు జన్మించినప్పటికీ..తమ బుజ్జాయి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేసింది.