Begin typing your search above and press return to search.

18 నెలల బాలుడి కడుపులో శిశువు.. డాక్టర్లే నివ్వెరపోయిన ఘటన

By:  Tupaki Desk   |   13 March 2021 5:50 AM GMT
18 నెలల బాలుడి కడుపులో శిశువు.. డాక్టర్లే నివ్వెరపోయిన ఘటన
X
బహుశా వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసు. 18 నెలల బాలుడి కడుపులో పిండం ఏర్పడింది. గర్భిణిలాగా ఆ బాలుడి కడుపు పెరుగుతున్నది. మరోవైపు బాలుడు క్రమంగా క్షీణించసాగాడు. అతడి కడుపులో మాత్రం పిండం పెరుగుతూ వస్తున్నది. ఈ కేసును సవాలుగా తీసుకున్న వైద్యులు.. బాలుడి కడుపులోంచి పిండాన్ని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్ర పూణేలోని పింప్రి ఆస్పత్రిలో చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు..

నేపాలీ సంతతికి చెందిన ఓ మహిళ 18 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పుట్టినప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బాలుడు పెరిగేకొద్ది అతడికి తరుచూ కడుపునొప్పి వస్తుండేంది. దీంతో తల్లిదండ్రులు చాలా మంది డాక్టర్లను సంప్రదించారు. అయితే పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్​ ప్రణబ్ జాదవ్ బాలుడి సమస్యను గుర్తించారు. బాలుడి శరీరంలో మరో పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. బాలుడి తల్లి గర్భిణిగా ఉన్నప్పుడే ఆమె కడుపులో రెండు పిండాలు పెరిగాయి. అయితే వీటిలో ఒక పిండం మరో పిండంలోకి వెళ్లింది. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

అయితే బాలుడికి సోనోగ్రఫీ, సిటి స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించగా.. బాలుడి కాలేయం, కుడి మూత్రాశయం మధ్యలో పిండం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాక ఈ పిండం పెద్ద రక్తనాళాలకు అనుసంధానించబడి ఉన్నట్టు గమనించారు. అయితే ఈ పిండం అప్పటికే మృతిచెందింది. దీంతో కడుపులో ఉన్న పిండాన్ని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్​ ప్రణబ్ జాదవ్, అతని బృందం ఆరు గంటలు కష్టపడి బాలుడిని రక్షించారు.

బాలుడి కడుపులో 550 గ్రాముల బరువు ఉంది. లోపల ఉన్న పిండానికి వేళ్లు, కాలి, చర్మం, జుట్టు, ఎముకలు, ఇతర అవయవాలు ఏర్పడ్డట్టు గుర్తించి వైద్యులు షాక్​ అయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 200 వరకు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ప్రతి ఐదు లక్షల మంది పిల్లల్లో ఇటువంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు పేర్కొన్నారు.