Begin typing your search above and press return to search.
ఈ ఫోటో చూస్తే వేదన చెందాల్సిందే..
By: Tupaki Desk | 7 Jan 2020 6:26 AM GMTమెదడు ఉన్న మనిషికి మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ.. చిన్న పక్షులు మొదలు ప్రపంచంలోని ప్రతి జీవికి అంతో ఇంతో బంధాలు.. అనుబంధాలకు సంబంధించిన భావోద్వేగాలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసినోళ్లంతా అయ్యో అనుకోవటమే కాదు.. అరేరే.. అని బాధ పడిపోతున్న పరిస్థితి.
ప్రాశ్చాత్య దేశంతో.. డెవలప్ మెంట్ లో మనకంటే ఎన్నో రెట్లు ముందు ఉండటమే కాదు.. సాంకేతికతలోనూ ముందుండే ఆస్ట్రేలియా ఇప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. గత సెప్టెంబరు నుంచి ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ ఈ కార్చిచ్చు మహమ్మారి కారణంగా ఏకంగా 50 కోట్ల జంతువులు ప్రాణాలు పోగొట్టుకున్నాయన్న నిజం చాలామందికి తెలీదు. తెలిసిన వారంతా తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
ఓపక్క పెద్ద ఎత్తున జంతువుల ప్రాణాలు పోతుంటే.. మరోవైపు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వాలు.. వ్యక్తులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిన్నసైజు ఎలుగుబంటిలా కనిపించే ఆస్ట్రేలియా ఖండానికి చెందిన శాఖాహారి జంతువైన కోలా కార్చిచ్చు కారణంగా గాయపడింది. దాన్ని కాపాడిన వైద్యులు చికిత్స చేస్తున్నారు.
తీవ్ర గాయాలకు గురైన తల్లి కోలాను చిన్నారి కోలా తల్లి మీద ఉన్న ప్రేమతో అలానే అతుక్కుపోయిన వైనం అందరి మనసుల్ని పిండేస్తుంది. తల్లీపిల్లల మధ్య ఉండే ప్రేమకు నిలువెత్తు రూపంగా ఇప్పుడీ ఫోటో వైరల్ అవుతోంది. అమ్మ అంటే పిల్లలకు ఎంత ప్రేమన్న విషయాన్ని జంతువుల నుంచి మనుషులు ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది.
వివాహేతర సంబంధాల మోజులో పడి.. ఇతర కారణాలతో పిల్లల్ని చంపుకునే తల్లిదండ్రులు మన చుట్టూ పెరిగిపోతున్న వేళ.. ఇలాంటి ఫోటోలు చూస్తే.. మనుషుల కంటే జంతువులే బెటర్ అనిపించక మానదు. ఇక.. ఈ తల్లి కోలాకు లిజీ అని పేరు పెట్టగా.. కూనకు పాంటమ్ అనే పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.