Begin typing your search above and press return to search.

బీఏసీ ముగిసింది...మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

By:  Tupaki Desk   |   20 Jan 2020 5:14 AM GMT
బీఏసీ ముగిసింది...మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
X
నవ్యాంధ్ర సీఎం హోదాలతో సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలను జెట్ స్పీడుతో తీసుకుంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పక తప్పదు. దాదాపుగా నెల రోజులకు పైగా ఏపీలో కీలక చర్చకు తెర తీసిన అధికార వికేంద్రీకరణ (ఏపీకి మూడు రాజధానులు), సఆర్డీఏ చట్టం రద్దులపై చర్చించేందుకు జగన్ సర్కారు ఓకే చెప్పింది. ఏపీలో రాజధానుల అంశంపై కొనసాగుతున్న రచ్చపై చర్చ లేకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉన్నా కూడా... మూడు రోజుల పాటు సాగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు అంశాలపై సమగ్ర చర్చకు అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితం ముగిసిన శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏఏ అంశాలపై చర్చలు జరపాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన భేటీ అయిన బీఏసీ సమావేశానికి అధికార వైపీసీతో పాటు విపక్ష టీడీపీ కూడా హాజరైంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం ముగిసిన కేబినెట్ భేటీలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను భేటీలో ప్రస్తావించిన జగన్ సర్కారు... వాటిపై శాసనసభలో సమగ్ర చర్చకు సిద్ధమేనని ప్రకటించింది. అంతేకాకుండా మూడు రోజుల పాటు జగరనున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే చర్చ జరగాలని ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా అధికార వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమంటూ టీడీపీ అభ్యంతరం చెప్పింది. ఇదే అదనుగా వైసీపీ... టీడీపీకి చెక్ పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేిసంది. అధికార వికేంద్రీకరణకు విరుద్ధమని చెబితే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీ పార్టీ వ్యతిరేకమేనా? అని వైసీపీ ఎదురు దాడికి దిగింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా? అన్న ప్రశ్న వినగానే... టీడీపీ వాయిస్ డల్ అయిపోయిందని తెలుస్తోంది. దీంతో సభను మూడు రోజుల పాటు నిర్వహించాలని, అదే సమయంలో మూడు రోజుల్లో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపైనే చర్చ జరగాలని, అందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ప్రకటించింది.