Begin typing your search above and press return to search.
పనామా దుమారం; బిగ్ బి..ఐశ్వర్యా..అదానీ..కేసీ సింగ్ ఎందరో..
By: Tupaki Desk | 4 April 2016 6:47 AM GMTప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దుమారంగా మారిన పనామా కుంభకోణానికి సంబంధించి సెగ భారత్ కు తగిలింది. చరిత్రలోనే అతి పెద్దదైన కుంభకోణంగా చెబుతున్న ఈ స్కాంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు.. భారత్ కు చెందిన 500 మంది ఉన్నట్లుగా ప్రాధమికంగా వెల్లడి కావటం తెలిసిందే. అయితే.. ఈ 500 మందిలో కొందరు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.
ఎవరూ ఊహించని విధంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఆయన కోడలు.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్.. డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్.. ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా.. ప్రముఖ ప్రారిశ్రామికవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ.. పశ్చిమ బెంగాల్ నేత శిశిర్ బజోరా.. ఢిల్లీ లోక్ సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా వెల్లడైన పత్రాల ప్రకారం పలువురు ప్రముఖులు పలు కంపెనీలు ఏర్పాటు చేయటం.. అనంతరం వాటిని మూసేయటం లాంటి మోసాలకు పాల్పడినట్లుగా పేర్కొంటున్నారు. అంతేకాదు.. అతి స్వల్ప మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన కంపెనీలు.. వాటి వ్యాపారాలు మాత్రం కోట్లాది రూపాయిలుగా ఉండటం.. కొన్నింటిని కాలక్రంలో మూసేయటం లాంటి మోసాలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి పేర్లు మాత్రమే బయటకు వచ్చినప్పటికీ.. వారు ఎలా మోసం చేశారు? దాని వివరాలు వివరంగా బయటకు రాలేదు. ఏది ఏమైనా ప్రపంచాన్ని వణికిస్తున్నభారీ కుంభకోణంలో క్లీన్ చిట్ పేరున్న అమితాబ్ పేరు రావటం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆయన్ని దేశ రాష్ట్రపతి రేసులో అభ్యర్థిగా ఈ మధ్యన వార్తలు రావటం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన అంశమని చెప్పక తప్పదు.