Begin typing your search above and press return to search.
జగన్ గారు ఇది చూశారా..మీ ఇన్ చార్జి ఆంధ్రజ్యోతికి దోచిపెడుతున్నారు
By: Tupaki Desk | 27 April 2020 9:30 PM ISTప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ దాదాపు 10 ఏళ్ల పైనే పోరాడారు. ఈ 10 ఏళ్లలో ఆయనపై జరగని కుట్ర లేదు.. చేయని అపవాదు లేదు. ముఖ్యంగా టీడీపీ, దాని అనుకూల మీడియా తిమ్మిని బమ్మిని చేసి ఎంత కుట్రచేసిందో కళ్లారా చూశాం. టీడీపీ అధినేత అనుంగ మిత్రుడు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ అయితే జగన్ టార్గెట్ గా ఎంత రచ్చ చేశాడో.. ఇప్పటికీ ఎంత చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అలాంటి పత్రికాధిపతికి దూరంగా ఉంటున్నారు అందరూ వైసీపీ శ్రేణులు. ఆ పత్రికను కొనడం కానీ.. అడ్వటైజ్ మెంట్లు ఇవ్వడం కానీ చేయకుండా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్న వేళ సీఎం జగన్ సైతం ఆ పత్రికను దూరం పెడుతున్నారు. వైసీపీ పార్టీ ప్రకటనలేవీ దానికి ఇవ్వడం లేదు. ఆర్థికంగా ఆ పత్రికకు ఎలాంటి సాయం చేయకుండా వైసీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
అయితే ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పాల్గొనకుండా సీఎం జగన్ బ్యాన్ చేశారు. మరి వైసీపీ అధినేత జగన్ అంత ఖరాఖండీగా ఆంధ్రజ్యోతితో వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ అధిష్టానానికి భయపడో లేక ప్రేమతోనే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. కొందరు ఇన్ చార్జిలు, వైసీపీ కేడర్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మొత్తం ఆంధ్రజ్యోతి మీడియాని వెలివేశారు. దీంతో దెబ్బకు ఆంధ్రజ్యోతి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సాఫ్ట్ ను కూడా తీసివేసింది. ఇలాంటి సందర్భంలో ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఇన్ చార్జి బాచిన చైతన్య తన పుట్టిన రోజున ఆంధ్రజ్యోతికి పెద్ద ఎత్తున అడ్వటైజ్ మెంట్లు ఇవ్వడం కలకలం రేపింది. ఇక క్యాడర్ వద్దు అన్నా వాళ్లకి చెప్పి మరీ ఇప్పించారు అని అక్కడి వైసీపీ వర్గాలు అంటున్నాయి.
అదేవిధంగా ఈ ఇన్ చార్జి ఆంధ్రజ్యోతి వాళ్లకు నెలకు కప్పం కట్టినట్టు కొంత సహాయం చేస్తున్నారు అని వినికిడి. ప్రతీరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి ఓనర్ ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు..ఇక ఆంధ్రజ్యోతి కూడా జగన్ ప్రభుత్వం ను అదే రీతిలో రోజు తిడుతోంది. ఇంత విభేదాలున్నా ఆంధ్రజ్యోతికి అడ్వటైజ్ మెంట్లు వైసీపీ నేతలు ఎలా ఇస్తారు అని ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. శత్రువుని.. జగన్ ని తిడుతున్న మీడియాకు ప్రకటనలు ఇవ్వడం అంటే కన్నతల్లి రొమ్ము గుద్దినట్టేనని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరి ఇప్పటికైనా వైసీపీ నేత తీరు మార్చుకుంటారో లేక ఆంధ్రజ్యోతిపై అంతే ప్రేమను కనబరుస్తాడో చూడాలి మరీ.