Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎప్పుడు జైలుకు వెళ్తాడో చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Dec 2016 9:40 AM GMT
జ‌గ‌న్ ఎప్పుడు జైలుకు వెళ్తాడో చెప్పేశారు
X
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మ విమ‌ర్శ‌ల జోరు పెంచారు. వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు క‌లిసేందుకు వెళుతున్న జ‌గ‌న్‌పై ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు గ‌తంలో జైలుకు వెళ్లిన ఉదంతాల‌ను ప్ర‌స్తావిస్తుండ‌గా...తాజాగా మళ్లీ జ‌గ‌న్ జైలు బాట పట్ట‌నున్న‌ట్లు జోస్యం చెప్పారు. అదికూడా డెడ్ లైన్ విధించి మ‌రీ ఎప్ప‌ట్లోగా జైలుకు వెళ్లనున్నారో తేల్చిచెప్పారు. ఇటీవ‌ల జ‌గ‌న్ మాట్లాడుతూ దేవుడు దయదలిస్తే ఏడాదిలో తమ ప్రభుత్వం వస్తుందని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు స్పందిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

అధికారం కోసం పగటి కలలు కంటున్నారని బ‌చ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. దేవుడు దయతలిస్తే ఏడాదిలో అధికారంలోకి రావ‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే... అదే స‌మ‌యంలో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని అర్జునుడు జోస్యం చెప్పారు. ల‌క్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద తిరుగుతున్న జగన్ త్వరలోనే జైలుకు వెళతారని, ఇది తెలియక అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బందరు పోర్టు - కారిడార్‌ ను జిల్లా వాసులంతా స్వాగతిస్తుంటే జగన్ మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని అర్జునుడు అన్నారు. కాకినాడలో పోర్టు ఉన్నా అనుబంధ పరిశ్రమలు లేనందున ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. విశాఖపట్నంలో ఓడరేవుతో పాటు అనుబంధ పరిశ్రమలు ఉండటంతో ఆ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఒక్క పోర్టుతోనే అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే మచిలీపట్నంలో పోర్టుతో పాటు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షంలో లేనిపోని ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటోందని అర్జును విమర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ప్ర‌తిప‌క్ష నేత జగన్ నిలుస్తున్నార‌ని అర్జునుడు ఆరోపించారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం అన్ని విధాలా వెనుకబడిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అవినీతికి ఐఎఎస్ అధికారులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోర్టు - పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అర్జునుడు అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఈ ప్రాంత రైతులకు వరం లాంటిదన్నారు. పోర్టు కల సాకారమవుతున్న తరుణంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు బాధాకరమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/