Begin typing your search above and press return to search.

మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన.. ఫైట్లో విస్తుపోయే ఘటన..!

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:40 AM GMT
మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన.. ఫైట్లో విస్తుపోయే ఘటన..!
X
ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ బిజినెస్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వృద్ధుడు ఆ మహిళపై మూత్రవిసర్జన చేయడంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ విషయాన్ని అప్పుడే సదరు మహిళ ఎయిర్ సిబ్బందికి విన్నవించినా సరైన స్పందన లేదని ఆమె వాపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటన గతేడాది నవంబర్ 26న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు ఆ మహిళ లేఖ రాసిన తర్వాతే ఎయిర్ ఇండియా అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ బిజినెస్ లో మహిళ ప్రయాణిస్తుంది. అదే ఫ్లైట్ ప్రయాణిస్తున్న ఓ 70 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఆ మహిళకు కేటాయించిన పైజామా మరియు డిస్పోజబుల్ పాదరక్షల సెట్‌లోకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అక్కడే ఉన్న మహిళ ఎదురుగా ఆ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసినపుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని పేర్కొంది అయితే అతను మాత్రం తన ప్రైవేట్ పార్ట్ తనకు చూపించడం కొనసాగించాడని.. మరొక ప్రయాణికుడు అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని కోరే దాకా తన సీటును విడిచి పెట్టలేదని తనకు జరిగిన అనుభవాలన్ని టాటా గ్రూప్ ఛైర్మన్ కు రాసిన లేఖలో పేర్కొంది. ఈ విషయాన్ని అప్పుడే ఎయిర్ సిబ్బందికి వివరించినట్లు చెప్పింది.

ఆ తర్వాత సిబ్బందిలో ఒకరు తన సీటుకు వద్దకు వెళ్లి అది మూత్రం వాసన ఉందని ధృవీకరించారని పేర్కొంది. తన బ్యాగ్.. బూట్లపై సిబ్బంది క్రిమిసంహారక మందును స్ప్రే చేశారని వివరించింది. ఈ సమయంలో తన సీటుకు తిరిగి రావడానికి ముందు ఒక గంటపాటు ఇరుకైన సీట్లో కూర్చున్నానని ఆ తర్వాత విమానంలోకి మిగిలిన సీటుకు సిబ్బంది తరలించినట్లు వెల్లడించింది.

అయితే విమానంలోని ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఏరియాలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని తోటి ప్రయాణీకుడి నుంచి తాను ఆ తర్వాత తీసుకున్నట్లు ఆ మహిళ ఆ లేఖలో పేర్కొంది. "బాధలో ఉన్న ప్రయాణికుడిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రాధాన్యత అని.. సిబ్బంది అలా భావించడం లేదంటూ" ఆమె టాటా గ్రూప్ చీఫ్‌కు రాసిన లేఖలో నివేదించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.